సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించడం, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబ సంగతులు షేర్ చేయడం మంచి లక్ష్మికి ఎలా అయితే అలవాటో అదే సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్స్‌కి గురి కావడం కూడా ఆమెకు అలవాటే. తనపై ఎన్నిరకాల ట్రోల్స్ జరిగినా పెద్దగా పట్టించుకోకుండా తనదైన స్టైల్‌లో ముందుకెళ్లడం ఈ మంచువారమ్మాయి నైజం. ఈ నేపథ్యంలోనే కరోనా విషయంలోనూ ఆమె వ్యవహార శైలి నెటిజన్లకు కోపం తెప్పించింది. రీసెంట్‌గా మంచు లక్ష్మికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మంచు మనోజ్, ఆ తర్వాత అదే ఫ్యామిలీ నుంచి కరోనా బారిన పడ్డారు. గో కరోనా గో అని గట్టిగా అరిచినా కూడా అది తనను పట్టుకుందని కాస్త వెరైటీగా కరోనా సోకిన విషయాన్ని చెప్పిన మంచు లక్ష్మి.. తాజాగా తనకు అని చెప్పడంలో కూడా డిఫరెంట్‌గా ఆలోచించి నెటిజన్లకు ట్రోల్స్ చేసే అవకాశమిచ్చింది. అందరికీ నమస్కారం. నాకు నెగెటివ్ వెచ్చేసింది అంటూ తెగ సంబరపడుతూ చెప్పిన మంచు లక్ష్మి.. తన కూతురు విద్య నిర్వాణకు లిప్ కిస్సులు ఇచ్చింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ విషయాన్ని బయటపెట్టింది. అయితే మంచు లక్ష్మికి కరోనా నెగెటివ్ రావడం సంతోషించదగిన విషయమే అయినా ఆ ఆనందంలో ఆమె చేస్తున్న పనులు అంత మంచివి కావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఇంకా కొన్ని రోజులు కేర్‌గా ఉండాల్సిన అవసరం ఉందని, చిన్న పిల్లతో అంత దగ్గరగా ఉంటూ ముద్దులు పెట్టడం సరికాదని అంటున్నారు నెటిజన్లు. ఇంకొందరు నెటిజన్లు అయితే మరో అడుగు ముందుకేసి మంచు లక్ష్మి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు. ఏదేమైనా కరోనా విషయంలో కూడా మంచువారమ్మాయి ట్రోల్స్ బారిన పడటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qj2hcX
No comments:
Post a Comment