ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను సినీ రంగానికి చెందిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ గురువారం రోజున ప్రత్యేకంగా కలుస్తున్నారు. అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీ తరపు నుంచి, మెగా క్యాంప్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఏపీలో సినిమా టికెట్ రేట్స్ తగ్గించడంపై వివాదం రోజు రోజుకీ ముదురుతుంది. వైసీపీ నాయకులు స్పందించడం.. దానికి తగ్గట్లే సినీ ప్రముఖులు స్పందించడం జరుగుతుంది. మరో వైపు ఏపీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్నినానితో ఇటీవల సినీ పరిశ్రమ నుంచి రామ్ గోపాల్ వర్మ మీటింగ్ కూడా ముగిసింది. ఈ తరుణంలో ఇప్పుడు వై.ఎస్.జగన్‌తో చిరంజీవి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఆ క్రమంలో టికెట్ రేట్స్‌కు సంబంధించిన చర్చ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ పెషీ నుంచి మర్యాద పూర్వకంగా చిరంజీవి ఆహ్వానించారని, ఆయన ఈరోజు మధ్యాహ్నం జగన్‌ను కలిసి అక్కడే విందు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి మాత్రమే వెళ్లి జగన్‌ను కలుస్తారా? లేక ఆయనతో పాటు సినీ పరిశ్రమకు చెందిన మరికొంత మంది వెళ్లి కలుస్తారా? అనేది తెలియడం లేదు. రాష్ట్రంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలేసి ఎందుకు సినిమా టికెట్స్ వ్యవహారంలో ప్రభుత్వం దూకుడు వ్యవహరిస్తుందనే విమర్శలు లేకపోలేదు. ఇన్ని రోజులు సినీ ప్రముఖులు, నిర్మాతలు కొందరు ప్రభుత్వ పెద్దలను కలిసి సినిమా టికెట్స్ వ్యవహారంలో తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే మధ్యలో ఈ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చిరంజీవి ఆహ్వానం వెళ్లడమనేది సానుకూల అంశంగానే సినీ వర్గాలు పరిగణిస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fhwsuH
No comments:
Post a Comment