సినీ పరిశ్రమలో బయటకు కనిపించే జిగేల్ మనే వెలుగులు వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఓ నటి లేదా నటుడో ఓ మంచి స్థాయికి రావడానికి ఎన్నో కష్టనష్టాలను భరించాల్సి ఉంటుంది. వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచినప్పుడే గుర్తింపు దొరుకుతుంది. పేరొస్తుంది. అలాంటి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఎదిగిన వ్యక్తే కమెడియన్ సత్య. హైదరాబాద్ వచ్చిన తొలినాళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. సత్య.. సినిమాల మీద మక్కువతో ఇంజనీరింగ్‌ను సగంలోనే ఆపేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ సమయంలో తండ్రి తనకు 10 వేల రూపాయలను ఇచ్చారట. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత కమెడియన్ సత్యకు అసలు ఇబ్బందులు మొదలయ్యాయట. డబ్బుల కోసం ఓ ఆసుపత్రిలో అద్దాలను తుడిచారట సత్య. దానికి ఆయనకు రోజుకి రెండు వందలు ఇచ్చేవారట. తను పనిచేసే చోట ఓ ఇద్దరు జూనియర్ ఆర్టిసులు పరిచయం అయ్యారు. వారు చెప్పిన చోటకి షూటింగ్ చూడటానికి వెళ్తే .. అక్కడ ఐదు వందల రూపాయలు తీసుకుని షూటింగ్ చూడటానికి పంపారట. ఆ సమయంలో మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు పరిచయం అయ్యారట. ఓసారి ఓ జూనియర్ ఆర్టిస్ట్ సత్య దగ్గరున్న డబ్బులు తీసుకుని పారిపోయారట. చివరకు డబ్బులు లేకపోతే, మూడు రోజుల పాటు నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నారట సత్య. తర్వాత తన ఇబ్బందులను తల్లికి ఫోన్లో వివరించారట. చివరకు తెలిసిన వాళ్ల స్నేహితుల ద్వారా ద్రోణ సినిమాకు దర్శకత్వ శాఖలో చేరారట సత్య. అలా కొన్ని రోజులు దర్శకత్వ శాఖలో పనిచేసిన తర్వాత నటుడిగా మారారు. ఇప్పుడు కమెడియన్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qCpxTC
No comments:
Post a Comment