గణ తంత్ర వేడుకలకు ముందు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మొగిలయ్య కూడా ఉన్నారు. ఆయనకు ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది. కిన్నెర 12 మెట్ల ఆఖరి తరం కళాకారుడైన మొగిలయ్యను తెలంగాణ ప్రభుత్వం కూడా తగు రీతిలో గౌరవించుకుంది. ఆయనకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి, ఇతర ఖర్చులకు కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే అంతకు కొన్నాళ్లు ముందు మొగిలయ్యతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా ‘భీమ్లా నాయక్’లో టైటిల్ సాంగ్‌ను పాడించుకున్నారు. ఆర్థికంగా సపోర్ట్ కూడా చేశారు. ఈ సినిమాలో పాట పాడినందుకు మొగిలయ్యకు చాలా మంచి గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ‘భీమ్లా నాయక్’ సినిమా గురించి.. అందులో పాట పాడిన సందర్బం గురించి మొగిలయ్య ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.‘‘ పీఏ నాకు ఫోన్ చేసి ఇలా పవన్ కళ్యాణ్‌గారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అన్నారు. నేను కూడా సరేనని అన్నాను. అప్పుడు ఆయన భీమ్లా నాయక్ షూటింగ్‌లో ఉన్నారు. నన్ను ఆ లొకేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కోలాహలంగా ఉంది. పెద్ద ఇల్లు లాంటి వాహనం ఉంది. అందులో నుంచి కాసేపయ్యాక పవన్ కళ్యాణ్ కిందికి దిగారు. ఆయన బూట్లు, సూట్లు వేసుకోలేదు. తెల్ల పైజమా వేసుకున్నారు. ఆయనే పవన్ కళ్యాణ్ అని నాకు తెలియదు. నేను గుర్తు పట్టలేదు. పవన్ కళ్యాణ్ అంటే సూటు, బూటు వేసుకుని ఉంటారని నేను అనుకున్నాను. కానీ ఆయన చాలా సింపుల్‌గా ఉన్నారు. ఆయన రాగానే నమస్కారం మొగిలయ్యగారు అన్నారు. నేను ఎవరో నాకు నమస్కారం చేస్తున్నారని అనుకుని నేను కూడా నమస్కారం పెట్టాను. తర్వాత పక్కనున్న పీఏ ఆయనే పవన్ కళ్యాణ్‌గారు అనగానే ఆశ్చర్యపోయాను. సార్.. మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను అని అప్పుడు అన్నాను. పవన్ కళ్యాణ్‌గారు నాతో బాగా మాట్లాడారు. మా సినిమాలో పాట ఉంది పాడుతారా? మొగిలయ్యగారు అన్నారు. పాడుతానండి అన్నాను. తర్వాత నన్ను వాళ్లు హోటల్‌కి తీసుకెళ్లారు’’ అంటూ పవన్‌ను కలిసిన సందర్భంగా గురించి మొగిలయ్య చెప్పుకొచ్చారు. అలా తొలిసారి పవన్ కళ్యాణ్‌ను చూసినప్పుడు తాను ఎందుకు ఆయన్ని గుర్తు పట్టలేదు అనే విషయాన్ని విషయాన్ని దర్శనం మొగిలయ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొగిలయ్య పాట పాడిన భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న విడుదలకు సిద్దమవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ojgvktlh
No comments:
Post a Comment