ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్స్ గొడవ సద్దుమణగడం లేదు. వైసీపీ నాయకులు సినీ పరిశ్రమను ఏదో అనడం.. దానికి సినీ పరిశ్రమలోని వారు ఏదో అనడం .. గొడవ ఇలాగే కొనసాగుతోంది. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం. తర్వాత పేర్ని నానిని కలిసి మీటింగ్ పెట్టడం జరిగిపోయాయి. ఈ క్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి. ఆయన ఓ మీటింగులో సినీ పరిశ్రమలోని వారు బలిసి కొట్టుకుంటున్నారనే మీనింగ్‌లో మాట్లాడారు. దానిపై సినీ పరిశ్రమ అంతా నల్లపు రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోయారు. ఓ ఎమ్మెల్యే అలా మాట్లాడటంపై పెద్ద రగడే జరిగింది. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు.. పవన్ - బాలకృష్ణ రాజకీయాల్లోఉండటం వల్లే ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను టార్గెట్ చేసిందటగా అని ప్రశ్నిస్తే తమ్మారెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్. కాబట్టి, బాలకృష్ణతో జగన్‌కు ఇబ్బంది ఉండదు. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడటం అంటావా? ఆయన జనసేన పార్టీ తరపున మాట్లాడి ఉండొచ్చు. ఆ పార్టీ గొడవలకు, సినీ ఇండస్ట్రీ సంబంధం ఏమీ లేదన్నారు. అలాగే రెమ్యునరేషన్స్ తగ్గించుకోవచ్చునని ప్రభుత్వంలో కొందరు అంటున్నారుగా.. దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నిస్తే.. హీరోకి ఉన్న డిమాండ్‌ను బట్టే నిర్మాత అతని డబ్బులు ఇస్తారని, ఎక్కువ ఇస్తారా? తక్కువ ఇస్తారా? అనేది ప్రొడ్యూసర్ ఇష్టం అని తమ్మారెడ్డి అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్స్ చేయడం లేదు అని ఏపీలోని నాయకులు అంటున్నారుగా దీనికి మీ సమాధానం ఏంటి? అని ప్రశ్నిస్తే.. చాలా మంది అటెన్షన్‌ను దక్కించుకోవడానికి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అలాంటి వాటిపై మాట్లాడటం అనవసరం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే షూటింగ్స్ అక్కడ జరుగుతున్నాయి. దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GnV695
No comments:
Post a Comment