బావతో సరదాగా నిహారిక..! మనమేంటో ఈ వీడియోనే చెబుతుంది.. మెగా డాటర్ పోస్ట్ వైరల్

నేడు (జనవరి 13) మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. నేటితో 32వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది మెగా డాటర్ . ఈ మేరకు బావపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తపరిచింది. ఈ వీడియోలో తన బావతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది నిహారిక. ఇద్దరూ చిన్న పిల్లల్లా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన నిహారిక.. వైష్ణవ్ తేజ్‌కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ వీడియో చూసి తమ మధ్య ఎంత బాండింగ్ ఉందనేది అర్థం చేసుకోవచ్చంటూ ట్యాగ్ లైన్ రాసింది. ఇంతవరకు చూడని స్వచ్చమైన మనసు, వ్యక్తిత్వం నీది అంటూ వైష్ణవ్ క్యారెక్టర్‌పై కామెంట్స్ చేసింది నిహారిక. ఎవ్వరికి ఏ అవసరం పడినా సాయం చేసే మొదటి వ్యక్తివి నువ్వే.. ధైర్యంతో, కష్టపడి పని చేసే వ్యక్తిత్వమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నేనెప్పుడూ మీ పెద్ద అభిమానిని హ్యాపీ బర్త్‌డే వైషుగా అని పేర్కొంది నిహారిక. దీంతో నిహారిక పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వైష్ణవ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. 'ఉప్పెన', 'కొండపొలం' తర్వాత గిరీషయ్య దర్శకత్వంలో తన మూడో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. అయితే ఈ రోజు వైష్ణవ్ పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా అనౌన్స్ చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tqheMs

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts