సింగర్ చిన్మయి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ప్రశ్నిస్తుంటారు. కొందరు మహిళలు బయటకు చెప్పుకోలేని తమ ఇబ్బందులను సింగర్ చిన్మయికి చెప్పి.. ఆమె ద్వారా ప్రశ్నలను లేవనెత్తేలా చేస్తుంటారనే సంగతి కూడా మనకు తెలిసిందే. లేటెస్ట్‌గా మరోసారి ఈ సింగర్ ఇలాంటి ఓ ప్రశ్నను తన సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? అసలు చిన్నయి తన సోషల్ మీడియాలో ఎవరి సమస్యను ప్రస్తావించారు? అనే వివరాల్లోకి వెళితే.. మలయాళ చిత్రసీమకి చెందిన ప్రముఖ హీరోయిన్‌ని 2017లో ఓ నటుడు కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ విషయం పెద్ద సెన్సేషనల్ టాపిక్‌గా మారింది. పలువురు సదరు హీరోయిన్‌కి తమ మద్దతుని తెలియజేశారు. అలా హీరోయిన్‌కి సపోర్ట్ చేసిన వారిలో నటి పార్వతి తిరువోతు ఒకరు. ఆమె మహిళా సంఘాలతో కలిసి హీరోయిన్‌కి మద్దతుగా పోరాటం కూడా చేసింది. అయితే అలా పోరాటం చేయడం వల్ల తను సినిమాల్లో అవకాశాలను కోల్పోయానని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తెలియజేవారు . తాను నటించిన సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ తనకు అవకాశాలు రాలేదని, హీరోయిన్‌కి మద్దతుగా పోరాటం చేసినందుకు తనను బెదిరించారని , తన చేతిలో ఇప్పుడు కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని పార్వతి ఆ ఇంటర్వ్యూలో చెప్పి బాధను వ్యక్తం చేశారు. ALSO READ : ఈ సమస్యపై సింగర్ చిన్మయి, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ‘‘నిజానికి మద్దతుగా మాట్లాడినందుకు మంచి నటి అయిన పార్వతి పని కోల్పోయారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల పనిని కోల్పోయానని ఆమె చెప్పడం నిజం. ఈ విషయంలో ఎందుకనో చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. ఈ సమాజం ఎందుకనో రేపిస్టులను ప్రేమిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నటుడు దిలీప్ కుమార్ రీసెంట్‌గా బెయిల్‌పై విడుదలయ్యారు. తనను జనవరి 18 వరకు అరెస్ట్ చేయకూడదని కేరళ హై కోర్టు పోలీసులను ఆదేశించింది. సింగర్ చిన్నయి మీ టూ ఉద్యమాన్ని దక్షిణాదిన ఉధృతంగా నడపటంలో ముందున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ రైటర్ వైరముత్తుపై అప్పట్లో ఆమె ఆరోపణలు చేశారు. రాధా రవి వంటి సీనియర్ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పటికీ ఆ సమస్యలపై ఆమె ఏదో ఓ రకంగా తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nrRgo4
No comments:
Post a Comment