‘గృహలక్ష్మి’ జనవరి 12 ఎపిసోడ్‌: ప్చ్!! శ్రుతి నెల తప్పిందంటూ అనసూయ సంబరాలు

పులికి తోకలా ఉండటంకంటే.. పిల్లికి తలగా ఉండటమే మంచిదనుకున్న నందు.. ఓ చిన్న కాఫీ కేఫ్‌లో బిజినెస్ హెడ్‌గా చేరడానికి రెడీ అయ్యాడు. మరోవైపు శ్రుతి వాంతులు చేసుకుంటూ కనిపించడంతో.. అనసూయ ఆమె నెల తప్పిందేమో అని తెగ పొంగిపోతుంది. నేను మునిమనవడు కావాలనుకున్నానో లేదో.. తదాస్తు దేవతలు దీవించేశారని తెగ సంబరపడిపోతుంది. నువ్ రెస్ట్ తీసుకోవాలి.. బరువులు ఎత్తకూడదు.. అర్జెంట్‌గా కుంకుమ పువ్వుని రప్పిస్తాను.. ఆ శుభవార్త అందరి చెవిలో వేసి వస్తానని వెళ్తుండగా.. శ్రుతి పరుగున వచ్చి అనసూయని ఆపేస్తుంది. అలా పరుగుపెట్టకూడదమ్మా.. నువ్ ఒట్టి మనిషివి కూడా కాదని అనసూయ అనడంతో.. నేను ఒట్టి మనిషినే అమ్మమ్మా.. విశేషం ఏమీ లేదు.. అవి వేగుళ్లు కాదు.. మామూలు వాంతులే అని అంటుంది శ్రుతి. దీంతో అనసూయ.. నిజంగానే నెల తప్పలేదా? లేదంటే తప్పే ఉద్దేశ్యం లేదా? అని అంటుంది. అదేం ప్రశ్న అమ్మమ్మా.. తల్లి కావాలని ఎవరికి ఉండదని శ్రుతి అనడంతో.. ఏమో అంకిత చూడు.. తన తల్లి మాట విని అబార్షన్ చేయించుకుంది.. ఇప్పటి వరకు తల్లి కాలేకపోయింది అని అంటుంది. పొరపాటున కూడా నువ్ అలాంటి పిచ్చి పనులు చేయకు.. ఏవయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని జాగ్రత్తలు చెబుతుంది అనసూయ. ఇక పని మనిషి వసంత వీరంగం అయితే ఆపడం లేదు.. ఆ ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో మల్లిక మాదిరిగా తెగ ఓవరాక్షన్ చేస్తుంది. ఆమె ఓవరాక్షన్‌కి తోడు అనసూయ పెర్ఫామెన్స్. వీళ్లిద్దరి మధ్య టీవీ రిమోట్ కోసం ఇద్దరి గొడవ జరుగుతుంది. మధ్యలో పరందామయ్య వచ్చి.. తన కళ్ల జోడు కనిపించడం లేదని చెప్పడంతో వసంతని వెళ్లి కళ్ల జోడు తీసుకుని రమ్మని చెప్తుంది అనసూయ. వసంత నేను చేయనని చెప్పేస్తుంది.. ఇంతలో గృహలక్ష్మి సీన్‌లోకి వచ్చి... కళ్ల జోడు తన మామయ్యకి అందిస్తుంది. వాళ్లిద్దరి పని కాకుండా మరెవరి పని చేయొద్దని వసంతకి లాస్య చెప్పింది అత్తయ్యా అందుకే ఆమె ఎవరి పనులు చేయడం లేదని చెప్తుంది తులసి. పెద్ద వాళ్లకి కళ్ల జోడు ఇస్తే పని అనరు.. మర్యాద అంటారు అని అనసూయ అనడంతో.. ఈరోజు కళ్లజోడు అంటారు.. ఆ తరువాత వండిపెట్టమంటారు.. అయినా నాకు జీతం ఇచ్చేది మా లాస్య మేడమ్.. మీ పనులు ఎందుకు చేయాలి.. మీరు అత్తగారు లాస్యకి నాకు కాదు కదా.. అని అంటుంది వసంత. దీంతో అనసూయ కోపంతో వసంత చేతిలో రిపోట్ లాక్కుని ఇప్పుడు చూడవే టీవీ అని అంటుంది. టీవీ రిమోట్ లాక్కుంటే.. ఫోన్‌లో చూసుకుంటా అని అంటుంది. దీంతో నా కొడుకు రానివ్వే నీ పని చెప్తా అని అంటుండగా.. నందు సీన్‌లోకి వస్తాడు. నాకు జాబ్ వచ్చింది అని గుడ్ న్యూస్ చెప్తాడు. తులసితో పాటు నందు పేరెంట్స్ కూడా సంతోషిస్తారు. ఆ సీన్‌లో తులసి పెర్ఫామెన్స్ పీక్స్ అనేట్టుగా చేసింది. కేఫ్‌లో జాబ్ వచ్చింది.. మీరు ఏమంటారు అని తన పేరెంట్స్ నిర్ణయాన్ని అడుగుతాడు నందు. చాలా రోజుల తరువాత నీ మొఖంలో సంతోషం కనిపిస్తుంది.. పని అంటే పనే.. అందులో చిన్నా పెద్దా ఏముంది? ఓ కొత్తదారిలో ప్రయాణం చేస్తున్నావ్.. కాలం కలిసి వస్తే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు అని అంటారు పరందామయ్య. భర్త కళ్లలో ఆనందం చూసి తులసి తెగ పొంగిపోతుంది. వాళ్ల పెర్ఫామెన్స్ చూసిన వసంత.. వీళ్లేంట్రా బాబూ.. విడాకులు తీసుకున్నాం అంటారు.. వీళ్ల ఫీలింగ్స్ చూస్తే ఇంటికి మామిడాకులు కట్టేట్టు ఉన్నారు.. వీళ్ల మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటుంది. ఇక నందు అయితే జాబ్ వచ్చిందనే ఆనందలో తనని తాను అద్ధంలో చూసికుని పొంగిపోతాడు.. గెలవాలని చెప్పిన తులసి మాటల్ని తలుచుకుంటూ ఉండగా.. ఇంతలో లాస్య నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడకుంటానే కట్ చేస్తాడు నందు. పరందామయ్య, అనసూయలకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది తులసి. ఇంతలో నందు వచ్చి.. ప్లేట్‌లో రైస్ పెట్టుకుంటూ వసంతని పిలుస్తాడు. వసంత తేసిన కూరల వాసన చూసే అతని ఆకలి చనిపోతుంది.. ముద్ద నోట్లోకి వెళ్లదు. అయిష్టంగానే కష్టపడి తింటుంటాడు. ఇంతలో తులసి తన కొత్త కాంట్రాక్ట్ గురించి అత్త మామయ్యలతో చెప్తుంది. దీంతో నందు తులసికి కంగ్రాట్స్ చెప్తాడు. వంట ఎలా ఉంది సార్ అని వసంత అడగడంతో ప్లేట్ ముందు నుంచి లేచివెళ్లిపోతాడు. అనసూయ.. రేయ్ నందు వచ్చి కూర్చోరా.. అమ్మని చెప్తున్నా.. వచ్చి కూర్చో.. ఈ అమ్మ బతికి ఉండగా.. నువ్ ఆకలితో ఉండకూడదు. నీకు నేను పడతాను అంటూ తులసి వండిన కూరల్ని వడ్డించి నందుకి భోజనం పెడుతుంది అనసూయ. ఆ తరువాత ‘అందమైన కలలకు తీరం’ అనే సాంగ్ వచ్చేస్తుంది. ఇక వీళ్ల పెర్ఫామెన్స్‌లు చూడాలీ.. నా సామిరంగా అనేట్టుగానే ఉన్నాయి. మొత్తానికైతే నందు కడుపు నిండా భోజనం చేస్తాడు. అది చూసి తులసి కడుపు నిండిపోతుంది. చూసేవాళ్ల తల భారం అవుతుంది. ఇక పరుగుపెట్టి పాలు తాగేయాలని.. తొందరగా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవించాలని వక్రమార్గం వైపు అడుగులేస్తున్నాడు అభి. ఈ ఇంట్లో వాళ్లకి ఎవరి గోల వాళ్లదే కానీ.. నా గురించి పట్టించుకోవడం లేదు.. నాకేం కావాలో అర్ధం చేసుకోవడంలేదు.. నా ఫ్రెండ్ మనోజ్ గాడు రెస్పాండ్ కావడంలేదేంటి? అని అనుకుంటుండగా.. ఇంతలో మనోజ్ కాల్ చేస్తాడు. ‘నీ సక్సెస్ స్టోరీ విన్నాక.. నేనూ ఓ నిర్ణయానికి వచ్చాను. సంపాదించడానికి షార్ట్ కట్ వెతుక్కోవాలి కానీ.. కష్టపడి లాభం లేదనుకున్నాను.. నేను కూడా షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలనుకుంటున్నా’ అని అంటాడు అభి. సరే కానీ మరోసారి ఆలోచించుకో.. లోతు ఎంత తెలియకుండా సముద్రంలోకి దిగకూడదు.. ఇందులోకి దిగడమే కాదు.. బయటకు రావడం కూడా తెలుసుకోవాలి’ అని జాగ్రత్తలు చెప్తాడు. మరి అభి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోచ చూడాలి. ఇక రేపటి ఎపిసోడ్‌లో.. నందు-లాస్యలు మధ్య జాబ్ విషయంపై రచ్చ రేగుతోంది. ఆ ముచ్చట్లు రేపు చూద్దాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31NMWaS

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts