బాత్ టబ్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్.. వీడియో క్లిప్ వైరల్! నెటిజన్ల కామెంట్లు చూస్తే..

పెరుగుతున్న టెక్నాలజీ, అందుబాటులో ఉన్న సోషల్ మీడియాను తమ తమ ప్రమోషన్ అస్త్రాలుగా మలచుకుంటున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. నిత్యం ఆన్ లైన్ మాద్యమాలపై యాక్టివ్ రోల్ పోషిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ తమ లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటోలు, వీడియోలతో అట్రాక్ట్ చేస్తున్నారు. ఆఫర్స్ కోసం సామజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ పోస్ట్ చేసిన ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో బాత్ టబ్ వీడియోను పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచింది హీరోయిన్ ప్రణీత. ఒళ్ళంతా సబ్బు నురగతో బాత్ రూమ్‌లో జలకాలాడుతూ ఈ వీడియోలో కనిపించింది. ఇంకేముంది క్షణాల్లో ఈ వీడియో వైరల్ కావడమే గాక నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. బ్యూటిఫుల్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఇంకొందరు మాత్రం ప్రణీత నుంచి ఇలాంటి వీడియో అస్సలు ఊహించలేదని కామెంట్స్ పెడుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రణీత తనదైన హోమ్లీ లుక్స్‌తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమా ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. పలు భాషల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఇకపోతే రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణీత.. పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ కొనగిస్తానంటోంది. లాక్ డౌన్ వేళ రహస్యంగా తన ప్రియుడు నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ప్రణీత. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. ఉన్నట్టుండి సడెన్‌గా ప్రణీత పెళ్లి పీటలెక్కడం ఆ సమయంలో అందరినీ ఆశ్చర్యపరచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Wchs4XE

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts