ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో '' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఫినిష్ చేశారు. చిత్రంలో సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు బిజినెస్ పరంగా భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబో అయ్యేసరికి సగటు ప్రేక్షకుడి కన్ను ఈ సినిమాపై పడింది. సినీ వర్గాల్లో ఓ రకమైన క్రేజ్ నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన 'లైగర్' అప్‌డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. దీంతో ఈ మూవీ హక్కుల విషయంలో పలు సంస్థలు పోటీపడుతున్నాయట. ఈ క్రమంలో లైగర్ డిజిటల్ హక్కులు భారీ ధరకు సేల్ అయ్యాయనే టాక్ బయటకొచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకుందని సమాచారం. అన్ని భారతీయ భాషల డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అటు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కెరీర్ లోనే ఇదే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముంబై చాయ్ వాలాగా కెరీర్ ఆరంభించిన ఓ కుర్రాడు ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడు? అనే కాన్సెప్ట్ తీసుకొని భారీ హంగులతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 25వ తేదీన ఈ లైగర్ సినిమా రిలీజ్ కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/t9RP48b
No comments:
Post a Comment