ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. సంక్రాంతి సీజన్ సమయంలో కరోనా తీవ్ర స్థాయిలో పెరిగింది. మూడో దశ మరింత ఉధృతంగా వచ్చింది.అయితే ఇప్పుడు మాత్రం కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. కరోనాతో సెలెబ్రిటీలకు చుక్కలు కనిపించాయి. టాలీవుడ్‌లో దాదాపు అందరికీ ఈ మూడో వేవ్‌లో కరోనా సోకింది. మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలు కరోనా బారిన పడ్డారు. ఇక సైతం కరోనా బారిన పడ్డారు. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉన్నా కూడా కరోనా అంటేసిందట. అకీరా నందన్, తనకు కరోనా పాజిటివ్ అంటూ రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఎవ్వరూ కంగారు పడొద్దని అభిమానులకు చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి దాదాపు పదిరోజులు క్వారంటైన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రేణూ దేశాయ్ కరోనా నుంచి కోలుకుంది. బయటకు వచ్చింది. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా కొందరికి ఇతర సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కానీ రేణూ దేశాయ్‌కి అలాంటివేమీ ఎదురుకాలేదనిపిస్తోంది. కరోనా తగ్గిన తరువాత ఇలా బయటకు వచ్చేసింది.డిన్నర్ కోసం అలా బయటకు వెళ్లిందట. కరోనా తరువాత ఇలా డిన్నర్ కోసం బయటకు వెళ్లడం చాలా కొత్తగా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. అసలే క్వారంటైన్ అంటూ నాలుగు గోడల మధ్యే ఉండటంతో పిచ్చెక్కిపోయి ఉంటుంది. మొత్తానికి ఇలా బయటి ప్రపంచాన్ని చూస్తుండటంతో సంతోషమేసినట్టుంది. రేణూ దేశాయ్ గత మూడేళ్లుగా రైతుల మీద సినిమా తీయాలని ఎదురు చూస్తూ ఉంది. కానీ కరోనా వల్ల అది సాధ్యపడటం లేదు. ఆద్య అనే వెబ్ సిరీస్ కూడా మధ్యలోని ఆగిపోయినట్టు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/qT6Rywa
No comments:
Post a Comment