బాలీవుడ్ హీరోయిన్ మాటతీరుతో పలు విషయాలు వివాదాస్పదం అవుతుంటాయి. అది ఎలాంటి అంశమైనా తాను చెప్పదలచుకున్న మ్యాటర్ నిర్మొహమాటంగా బయటపెడుతుంటుంది కంగనా. ఈ క్రమంలోనే తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ లేటెస్ట్ మూవీ గెహ్రియాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. '' ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే జనం చూపు ఈ సినిమాపై పడింది. భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. రణ్‌వీర్‌తో పెళ్లి తర్వాత దీపికా ఇలాంటి ప్రేమకథలో నటించడం మొదటిసారి కావడంతో ఆమెపై కొంతమంది నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీంతో బీటౌన్‌లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ ఈ సినిమాలోని శృతిమించిన రొమాన్స్‌పై కంగనా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఇన్స్‌స్టాలో కామెంట్స్ చేసింది. ''నేను కూడా ఈ తరానికి చెందిన వ్యక్తినే. కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను. ఈ తరం అనే పేరుతో చెత్త సినిమాలను అమ్మకండి ప్లీజ్. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి. స్కిన్ షో, అశ్లీలత చెత్త సినిమాలను ఏ మాత్రం కాపాడలేవు'' అని పేర్కొంటూ గెహ్రియాన్ సినిమాలోని రొమాన్స్ సీన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. ఈ 'గెహ్రియాన్' చిత్రంలో దీపికా పడుకోణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించారు. షకున్ భత్రా దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/FG0heV6
No comments:
Post a Comment