ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా భారీ చిత్రాలు చేస్తూ మ్యూజిక్ సెన్సేషన్‌గా విపరీతమైన క్రేజ్‌తో ఉన్నారు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ . అల వైకుంఠపురములో సినిమా తర్వాత నుంచి థమన్ క్షణం తీరిక లేకుండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. తెలుగులో దాదాపు అందరి హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్న థమన్..సాంగ్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘’ సినిమా సాంగ్ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పవర్ స్టార్ , రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను ఫిబ్రవరి 11న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పవన్, రానా పోషిస్తున్న పాత్రలు భీమ్లా నాయక్, డానియేల్ శేఖర్ ఎంట్రో టీజర్స్..పాటలు వచ్చి భారీగా అంచనాలను పెంచాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా పాట విషయంలో కాపీ రైట్స్ వివాదం రాజుకుంది. ఈ మూవీని మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్‌గా నిర్మిస్తున్నారు. కాగా, మలయాళ వెర్షన్‌కు జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇప్పుడు ఆయన ట్యూన్స్‌నే తెలుగు రీమేక్ ‘భీమ్లానాయక్’లో నూ ఉపయోగించినప్పటికీ.. నిర్మాతలు తనకు క్రెడిట్ ఇవ్వలేదని జాక్స్ ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలో ఆయన ఐపిఆర్ఎస్ (ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. అయితే, దీనిపై ఇంకా చిత్ర సంగీత దర్శకుడు థమన్ కానీ, దర్శక నిర్మాతలు కానీ స్పందించలేదు. ఇంతకముందుకు కూడా ఇలాగే కొన్ని సినిమాలకు సంబంధించి కాపీరైట్ సమస్యలు తలెత్తడంతో మేకర్స్ వాటిని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడు ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను పీడివీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే, మాటలతో పాటు ఓ పాటను రాశారు. పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనున్నారు. కాగా, జాక్స్ బిజోయ్ గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి రూపొందిస్తున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7HpMujI
No comments:
Post a Comment