‘సర్కారు వారి పాట’.. సాంగ్ లీక్..ఇప్పుడు సినిమా పరిస్థితేంటో..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజైన కళావతి సాంగ్ లీకవడంతో మేకర్స్‌కు షాక్ తగిలింది. సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట్ తర్వాత మహేశ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీత గోవిందం సినిమాతో రూ. 100 కోట్ల మార్క్‌ను టచ్ చేసి అగ్ర దర్శకుల జాబితాలో చేరిన పరశురామ్ పెట్లా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దుబాయ్‌తో పాటు గోవా..హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణను జరిపారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణం నేపథ్యంగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. అయితే, ఇప్పటికే రిలీజ్ ఆలస్యం అయిన సర్కారు వారి పాట చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో మరింత ఆలస్యం అవుతుందని మహేశ్ బాబు ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. అందుకే, వారికి కాస్త ఊరట కలిగించేందుకు చిత్రబృందం వాలెంటైన్స్ రోజు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సాంగ్ ప్రోమో వచ్చి ఆకట్టుకుంటోంది. కెరీర్‌లో ఇప్పటి వరకు కనిపించనంత గ్లామర్‌గా కీర్తి కళావతి సాంగ్‌లో సందడి చేయబోతుందని ప్రోమో చూస్తేనే అర్థమైంది. ఇక మహేశ్ కూడా అల్ట్రా మోడ్రన్ లుక్‌లో కనిపించబోతున్నాడు. అందుకేనేమో ఫిబ్రవరి 14వరకు ఆగలేక ఎవరో ఈ సాంగ్‌ను సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఇది తెలిసి మేకర్స్ షాకయ్యారట. కొందరేమో సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకే చిత్రబృందంలోని సభ్యులలో ఎవరో ఒకరు లీక్ చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇది కూడా సర్కారు వారి పాట సినిమా ప్రచారానికి బాగానే ఉపయోగపడింది. చూడాలి మరి కళావతి సాంగ్ ఏమేరకు అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/50OSsTM

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts