మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాల్లో కంటెంట్ మారుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం రొమాన్స్ డోసేజ్ అనేది మూవీస్‌లో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా బూతులు మాట్లాడటం, లిప్ లాక్ సీన్స్ ఇవన్నీ సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తున్నాయి. సినిమాల్లో కొన్ని సీన్స్, కాస్త కిసెస్ అనేవి గుర్తింపు సంపాదించుకోవడానికి దగ్గర దారి అని అనుకుంటున్నారా? ఓ యాంకర్ హీరో సిద్ధు జొన్నల గడ్డను ప్రశ్నిస్తే.. తను మీరు చూస్తున్నట్లు అదేం పెద్ద విషయం కాదు. బోల్డ్ బోల్డ్.. అంటూ వంద సార్లు అనడం వల్ల అది పెద్ద విషయంగా కనిపిస్తుంది అని బదులిచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ, జంటగా నటించిన ‘’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాలు, డైలాగ్స్‌లో కాస్త రొమాన్స్ డోసు ఎక్కువగా కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. అదే సమయంలో హీరోయిన్ పుట్టు మచ్చల గురించి ఓ విలేకరి వేసిన ప్రశ్న కాంట్రవర్సీగా కూడా మారింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12న ‘డిజె టిల్లు’ విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో సిద్ధు జొన్నల గడ్డ చాలా ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ క్రమంలో కిస్సులు, అమ్మాయిలు సినిమాలో చూపిస్తే చాలా? అని యాంకర్ అన్నప్పుడు సిద్ధు పైన చెప్పినట్లు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇదే ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డను సదరు యాంకర్ ప్రశ్నిస్తూ మీరు నిజ జీవితంలోనూ మీకు అమ్మాయిల పిచ్చి ఉందా అని అర్థం వచ్చేలా ఇంగ్లీష్‌లో మీరు ఉమనైజరా? అని క్వశ్చన్ చేశారు. కాసేపు ఆలోచించిన సిద్ధు.. అసలు ఉమనైజర్ అంటే నాకు వివరించండి అనడం ఆ ఇంటర్వ్యూలో కొస మెరుపుగా మారింది. అసలు ఇంతకీ సిద్ధు జొన్నల గడ్డకు నిజంగానే అమ్మాయిల పిచ్చి ఉందా? మరి ఆ ప్రశ్నకు ఆయన ఏమని సమాధానం చెప్పారు.. అనే విషయం తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Ss3Ba54
No comments:
Post a Comment