
సూపర్ స్టార్ మహేష్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తన తదుపరి సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పరమైన డిస్కషన్స్ స్టార్ట్ చేసేశారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు రాజమౌళి కేవలం మహేష్‌తోనే కాకుండా మరో అగ్ర హీరోను కూడా తన సినిమాలో నటింప చేసే ప్రయత్నాలను చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే RRRతో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కించిన ఇప్పుడు మహేష్ సినిమాను కూడా బారీ మల్టీ స్టారర్‌గా మలిచే ఆలోచనలో ఉన్నారట. జక్కన్న తయారు చేస్తున్న కథలో ఓ పవర్ ఫుల్ పాత్ర ఉంటుందని, దాంట్లో ఓ సీనియర్ హీరో నటిస్తారని టాక్. సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల మేరకు మహేష్ - రాజమౌళి చిత్రంలో నందమూరి హీరో బాలకృష్ణ నటించే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులు మరోసారి పండగ చేసుకుంటారు. అయితే రాజమౌళి తన సినిమాను పాన్ ఇండియా మూవీగా చేస్తాడు కాబట్టి.. సదరు పాత్రలో టాలీవుడ్ హీరోను తీసుకుంటాడా? లేక ఇతర సినీ పరిశ్రమల్లోని అగ్ర హీరోలను ఒప్పిస్తాడా? అనేది తెలియడం లేదు. ప్రస్తుతం మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. అది పూర్తయిన తర్వాతే రాజమౌళి సినిమా ట్రాక్ ఎక్కుతుంది. రాజమౌళి తన సినిమాను స్టార్ట్ చేయడానికి ఆరేడు నెలల సమయం పడుతుందని చెప్పడంతోనే మహేష్.. త్రివిక్రమ్ సినిమాను ట్రాక్‌లోకి తీసుకొచ్చాడని న్యూస్. మరో వైపు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో జక్కన్న తెరకెక్కించిన RRR, మార్చి 25న విడుదలవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/PtF5Nhg
No comments:
Post a Comment