అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి 'భీమ్లా నాయక్' వేదికపై మాట్లాడిన మాటలు, ప్రసంగాల తాలూకు క్లిప్స్ వైరల్ అవుతూ ఉండేవి. నిన్న (ఫిబ్రవరి 21) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి అకాల మరణంతో క్యాన్సిల్ అయింది. ఎంతో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు కానీ చివరకు రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు.. ఈ ఈవెంట్ వాయిదా పడటంతో కాస్త నిరాశ చెందారు. మరోవైపు చిత్ర రిలీజ్ డేట్ అతి దగ్గర్లో ఉండటంతో అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 25 రిలీజ్ అంటే మరో మూడు రోజులే గ్యాప్ ఉంది ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేనా? అనే డౌట్స్ షురూ అయ్యాయి. ఈ క్రమంలో అలాంటి అనుమానాలు పటాపంచలయ్యేలా బుధవారం రోజు అనగా (ఫిబ్రవరి 23) ఈ ఈవెంట్ జరపాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. ముందుగా అనుకున్న ప్రకారం గ్రాండ్ ఈవెంట్ జరపాలని ఇందుకు గాను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కావాలని ఫైనల్ అయ్యారట. ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనేది ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే డేట్ మారింది కాబట్టి భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తారా? లేదా అనేది కూడా జనాల్లో హాట్ టాపిక్ అయింది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో భీమ్లా నాయక్ మూవీ రూపొందించారు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/dzJUqwh
No comments:
Post a Comment