ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్.జగన్ .. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సుమంత్ చదువుకునే రోజుల్లో మంచి స్నేహితులు. ఈ విషయాన్ని హీరో సుమంత్ పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇప్పుడు హీరో సుమంత్ హీరోగా ‘మళ్లీ మొదలైంది’ సినిమా విడుదలవుతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వై.ఎస్.జగన్ గురించి మాట్లాడే సందర్బం వచ్చినప్పుడు హీరో సుమంత్ మాట్లాడుతూ ‘‘నాకు జగన్ చదువుకునే రోజుల నుంచి పరిచయం. తను అప్పుడు నాతో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. మేం చదువుకునే రోజుల్లో తనను గమనించే వాడిని. తను కచ్చితంగా రాజకీయాల్లో మంచి పొజిషన్‌కు వస్తాడని ఊహించాను. నా నమ్మకం నిజమైంది. తను ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఏదైతే ఊహించానో దాన్ని తను ప్రూవ్ చేశాడు’’ అన్నారు. సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి సౌందర్ రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం . విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. సినిమాలో పెళ్లి కార్డుని సోషల్ మీడియాలో లీక్ చేయడంతో సుమంత్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ రూమర్సేనని, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే అలా చేశారని చివరకు తెలిసింది. మళ్లీ మొదలైంది చిత్రానికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జీ5లో ఫిబ్రవరి 11న విడుదలవుతుంది. మళ్లీ మొదలైందితో పాటు సుమంత్ అనగనగా ఒక రౌడీ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని సుమంత్ తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/XTkPdlF
No comments:
Post a Comment