పక్కా మాస్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తున్నారు డైరెక్టర్ . స్టార్ హీరోలతో వరుస హిట్ సినిమాలు రూపొందిస్తూ ఇండస్ట్రీకి భారీ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా 'అఖండ' సినిమాతో బిగ్ సక్సెస్ అందుకున్న బోయపాటి.. అదే జోష్‌లో తదుపరి కథపై కసరత్తులు షురూ చేశారు. అఖండ విజయోత్సాహంతో నెక్స్ట్ మూవీ పనులు చకచకా కంప్లీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బోయపాటి రెమ్మ్యూనరేషన్ గురించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో బాలకృష్ణతో సింహ, లెంజెండ్ సినిమాలు రూపొందించి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి.. రీసెంట్‌గా అదే బాలకృష్ణతో 'అఖండ' రూపంలో హాట్రిక్ అందుకున్నారు. దీంతో బోయపాటి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలుస్తోంది. హీరోని మించి రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగారట బోయపాటి. ఆయన తదుపరి సినిమా విషయంలో ఇదే జరగబోతోందనే టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బాలయ్య బాబుతో కలిసి 'అఖండ' సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీ అయ్యారు బోయపాటి శ్రీను. అయితే ప్రస్తుతం బాలకృష్ణ కాస్త బిజీ షెడ్యూల్‌లో ఉండటం వల్ల ఈ లోగా మరో హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు బోయపాటి. ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఈ సినిమా ఉండనుందని సమాచారం. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో రామ్ కోసం కథ సిద్ధం చేసిన ఆయన, ఈ మూవీ కోసం రామ్‌ని మించిన రెమ్మ్యూనరేషన్ అందుకోబోతున్నారని టాక్. ఈ సినిమాకు గాను హీరో రామ్ 9 కోట్ల రెమ్మ్యూనరేషన్ తీసుకోబోతున్నారని, అయితే దర్శకుడు బోయపాటి మాత్రం అంతకు మించి 3 కోట్లు అదనంగా అంటే 12 కోట్ల రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/FM0UP4d
No comments:
Post a Comment