కన్నడ రాకింగ్ స్టార్ నటించిన పాన్ ఇండియా మూవీ . ఈ చిత్రం KGF Chapter 1కి కొనసాగింపు అనే సంగతి తెలిసిందే. కరోనా కారణంగా 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 14, 2022లో విడుదలకు సన్నద్ధమైంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి ఆసక్తికరమైన వార్తొకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..KGF Chapter 2 ఐటెమ్ సాంగ్‌ను మేకర్స్ క్రేజీగా ప్లాన్ చేశారట. బాలీవుడ్ ఐటెమ్ బాంబ్ నోరా ఫతేహి ఇందులో నర్తించారు. ఆమెకు ఇందు కోసం భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా ఇచ్చినట్లు సమాచారం. అయితే KGF Chapter 2 ఐటెమ్ సాంగ్‌కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం తెలసింది. అదేంటంటే.. బాహుబలి తొలి పార్ట్‌లోని ‘మనోహరి..’ సాంగ్‌ను రీమిక్స్ చేసినట్లు సమాచారం. ఈ రీమిక్స్ సాంగ్‌లోనే యష్, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కాలు కదిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వార్తలపై మేకర్స్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందో చూడాలి. హోంబలే ఫిలింస్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్‌లో KGF Chapter 2ను రూపొందించింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటించగా, మరో బాలీవుడ్ సీనియర్ స్టార్ రవీనాటాండన్ కీలక పాత్రలో నటించారు. కొన్ని నెలలు ముందు విడుదలైన KGF Chapter 2 టీజర్ సోషల్ మీడియాలో 200కి పైగా వ్యూస్‌ను సాధించింది. దీంతో సినిమాపై అందరూ ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారో అర్థమైంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. KGF Chapter 1 విడుదలై మూడేళ్లు దాటేసింది. పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. మరిప్పుడు KGF Chapter 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/HMaoO0c
No comments:
Post a Comment