సురేఖా వాణి... టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా మారింది. వైన్ గ్లాస్‌తో ఉన్నా..గోవాలో ప్టారీ చేసుకుంటున్నా.. ఇలా ఏ పని చేసినా సదరు ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ తన మార్క్ ఉండేలా చూసుకుంటుంది . నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడే లుక్స్ ఆమెవని సోషల్ మీడియాలో ఫొటోలు చూసిన వారే చేసే కామెంట్స్. ఆమె కుమార్తె కంటే సురేఖా వాణినే అందంగా కనపడుతున్నారని కొందరు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ సమయంలో కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో ఈమె చేసిన హల్ చల్ ఈమెకు మరింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది సురేఖా వాణి. అది కూడా తన కూతురుతో కలిసి డాన్స్ చేస్తూ.. పొట్టి గౌను వేసుకుని కూతురితో కలిసి ఆమె చేస్తున్న డాన్స్ చూసిన నెటిజన్స్ కూతురు సుప్రిత కంటే మీరే బావున్నారని, సుప్రితకు మీరు అమ్మలా కాదు..అక్కయ్యలా ఉన్నారని, చాలా హాట్‌గా ఉన్నారని ఇలా తమదైన రేంజ్‌లో కామెంట్స్ పెట్టారు. మరికొందరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే చేసుకుంది. మరి ఇలా పొట్టి బట్టలు వేసుకుని కూతురితో కలిసి చిందేయాలా.. హవ్వ అని నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే ఎవరు ఏమనుకున్నా తన స్టైల్ తనదే అంటుంది సురేఖా వాణి. ఇది వరకు ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితమైన సురేఖా వాణి ఇప్పుడు ట్విట్టర్‌లోనూ ఎంట్రీ ఇచ్చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eJfBAY
No comments:
Post a Comment