సంచలన దర్శకుడు గురించి ప్రత్యేకమైన వివరణ అవసరమే లేదు. రెండు తరాల ఆడియన్స్‌కి వర్మ క్యారెక్టర్ గురించి ఎంతో కొంత ఐడియా అయితే ఉంది. ఆయనేంటి? ఆయన సినిమాలు ఎలా ఉంటాయి? అసలు ఆయన మెంటాలిటీ ఎలాంటిది? ఇతరులతో ఆయన మెదిలే తీరు, సమాజాన్ని చూసే విధానం ఎలా ఉంటుందో కొంతలో కొంతైనా తెలుసు. ఇక వర్మ ఎదుట అమ్మాయి కూర్చుంటే ఆయన మాట్లాడే విధానం, చేసే కామెంట్స్ అబ్బో.. మాటల్లో చెప్పలేం. ఎదుట ఉన్న అందాలను పొగిడేస్తూ నొప్పించకుండానే సెక్సీ కామెంట్స్ చేస్తుంటారు . అలాంటి వర్మ గురించి బిగ్ బాస్ బ్యూటీ మాట్లాడుతూ యమ బోల్డ్‌గా రియాక్ట్ అయింది. నిజ జీవితంలో చోటు చేసుకునే పరిస్థితులు, రెగ్యులర్ లైఫ్ స్టైల్‌పై ఓపెన్‌గా మాట్లాడటం రామ్ గోపాల్ వర్మ లక్షణం. అందుకే ఆయన సినిమాల సంగతి పక్కనబెడితే ఆర్జీవీ ఇంటర్వ్యూ ఇచ్చారంటే అందులో చాలా చాలా స్టఫ్ ఉంటుందని జనం భావిస్తుంటారు. ఇప్పటికే ఎందరో యాంకర్స్ అందాలపై హాట్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. రీసెంట్‌గా అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డిని అన్నీ ఓపెన్‌గా అడిగేస్తూ సెక్సువల్ లైఫ్ గురించి చాలా అంశాలను లేవనెత్తారు ఆర్జీవీ. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఆర్జీవీ తీరు, సెక్సువల్ లైఫ్‌లో ఆయన పొందే ఆనందం గురించిన వివరణ ఇచ్చి సడెన్ షాకిచ్చింది అషు రెడ్డి. అంతేకాదు ఆర్జీవీ అంటే తనకు ఎందుకు ఇష్టమనే విషయాన్నీ కూడా ఓ వీడియో ద్వారా బయటపెట్టేసింది. ఆర్జీవీతో చాలాసార్లు పర్సనల్‌గా చర్చించానని, ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా గొప్పగా వివరిస్తారని చెప్పింది. ముఖ్యంగా శృంగార జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఆయన వివరంగా చెప్పారని, అయితే ఈ రోజుల్లో అలా చెప్పడంలో తప్పులేదని తాను భావిస్తున్నట్లు చెబుతూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది. శృంగార జీవితంలో బ్యూటీ అనేదాన్ని ఎలా ఆస్వాదిస్తారో కూడా చాలా క్రియేటివ్‌గా ఆర్జీవీ వర్ణించారని, సెక్సువల్ లైఫ్, రెగ్యులర్ లైఫ్.. వాటిని ఎలా ఎంజాయ్ చేస్తారనే దానిపై పూర్తి అర్థవంతంగా అన్నీ తెలియజేశారని అషు రెడ్డి చెప్పడం గమనార్హం. ఆయనలో ఉండే ఆ ఓపెన్‌నెస్ తనకు చాలా నచ్చిందని, అందుకే ఆయనంటే చాలా ఇష్టమని అషు పేర్కొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s1kcX1
No comments:
Post a Comment