ఏ ముహూర్తాన 'పుష్ప' మూవీ నుంచి ఐటెం సాంగ్ రిలీజ్ చేశారో గానీ ఆ క్షణం నుంచే సోషల్ మీడియాలో సంచలనాలు మొదలయ్యాయి. సమంత ఐటెం సాంగ్ అని తెలియగానే ఆ పాటపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ కాగా.. 'ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ' అంటూ అంతకుమించిన కిక్కిచ్చింది పుష్ప యూనిట్. ఇక సాంగ్ విడుదల కాగానే ట్రెండింగ్ అవుతూ భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. మరోవైపు ఈ పాటపై పలు వివాదాలు రాజుకున్నాయి. ఈ సాంగ్‌లో వాడిన పదాలు పురుషుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని, అందులోని సాహిత్యం మగవాళ్లందరూ కామంతో ఉంటారనే అర్థం వచ్చేలా ఉందని, వెంటనే ఆ పాటను సినిమా లోంచి తీసేయాలంటూ పురుష సంఘం ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించడం రచ్చకు దారి తీసింది. దీంతో ఈ ఇష్యూ జనం నోళ్ళలో నానుతుండగా ఎంటరైంది. ఫెమినిజం భావాలు పుష్కలంగా ఉన్న ఆమె పుష్ప సాంగ్ ఇష్యూపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ''వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా.. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98% సాంగ్స్ అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీస్ చేయాలిక. ఇక నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటి ఒక అమ్మాయికి మగాడిని చూస్తే, అతను పోతుంటే అంత చులకనగా వెంటపడి వెళ్ళిపోద్దా?? అబ్బాయి నడిచిన చోట భూమిని టచ్ చేసి మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే.. నేను కూడా పెడతా కేసు. అంతే.. తగ్గేదేలే'' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది మాధవీలత. దీంతో మరోసారి సమంత స్పెషల్ సాంగ్ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాటలను ప్రముఖ రచయిత చంద్రబోస్ రాయగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. స్పెషల్ సాంగ్‌లో సమంత హాట్ లుక్స్ ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలిగించాయి. అయితే ఈ పాటపై నడుస్తున్న వివాదంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17వ తేదీన పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s5twsK
No comments:
Post a Comment