మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ సెంటిమెంట్.. బోయపాటి చేతిలో బాల్! నటసింహం స్కెచ్ ఇదే..

నందమూరి వారసుడిగా వెండితెరపై హవా నడుస్తోంది. బాల నటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు బాలయ్య బాబు. విలక్షణ పాత్రలు పోషిస్తూ నేటికీ అదే ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇవ్వాల్టి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు నందమూరి నటసింహం. ఇదంతా ఫ్యాన్స్‌ని ఆనంద పెడుతున్నా.. బాలకృష్ణ వారసుడు సినీ ఎంట్రీపై ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతోంది. బాలయ్య బాబు సినీ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన కొడుకు మోక్షజ్ఞ సినీ గడప తొక్కబోతున్నాడంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం నడుస్తోంది. కానీ ఇప్పటికీ ఆయన తొలి సినిమాపై అధికారిక సమాచారం అయితే రాలేదు. బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి' తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు ఎదురుచూపులే మిగిలాయి. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ప్రకటించి అభిమానులకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం ఆ వైపుగా అడుగులేస్తున్నట్లు సమాచారం. బాలయ్య బాబు హీరోగా వచ్చి అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'ఆదిత్య 369' సీక్వల్‌తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతను బోయపాటి తీసుకున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తనకు హాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాలని సెంటిమెంటల్‌గా బాలయ్య ఫిక్సయ్యారట. ప్రస్తుతం బలకృష్ణ- నడుమ మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన చర్చలు నడుస్తున్నాయని ఇన్‌సైడ్ టాక్. మరి 'ఆదిత్య 369' సీక్వల్‌‌నే బోయపాటి హ్యాండిల్ చేస్తారా? లేక మరో బలమైన కథతో మోక్షజ్ఞను రంగంలోకి దించుతారా అనేది చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32oqdCx

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts