దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రం RRR. బాహుబలితో తెలుగు సినిమా సత్తాను బాలీవుడ్‌లోనే కాదు..ప్రపంచానికి చాటారు. ఆయన డైరెక్షన్‌లో ఇప్పుడు వస్తోన్న చిత్రం RRR. ఇండియానే కాదు.. ఎంటైర్ వరల్డ్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత తన నుంచి రాబోయే సినిమాలు ఎలా ఉండాలో నిర్ణయించుకున్న జక్కన్న అందుకు తగినట్లే ప్లాన్ చేసుకుని సినిమాను అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ పోరులో నువ్వా నేనా అని పోటీ పడే మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా సినిమా అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కాదండోయ్.. ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో ఎప్పుడూ కలుసుకోని ఇద్దరు పోరాట యోధులు కొమురం భీమ్, అల్లూరి సీతా రామరాజు కలుసుకుని వారి భావాలను ఇచ్చి పుచ్చుకుని, స్నేహం చేయడం, గొడవ పడటం వంటి చేస్తే ఎలా ఉంటుందనే అనే ఊహాత్మక పాయింట్‌తో RRR సినిమాను తెరకెక్కించారు మన జక్కన్న. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, ప్రోమోలు, ట్రైలర్ అన్నీ సినిమాపై ఉన్న అంచనాలను పెంచేస్తూ వచ్చాయి. ఆదివారం ముంబైలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. వీరిద్దరూ అసలు సెట్స్‌లో ఎలా ఉండేవారు అనే అనుమానం ప్రేక్షకులకు ఉండిపోయింది. అది కూడా రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో తీర్చేశారు. ఎంత సరదాగా ఉండేవారో చెప్పుకొచ్చారు రాజమౌళి. RRR మేకింగ్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి షూటింగ్స్‌కు రావడం, సెట్స్‌లో కలిసి సందడి చేయడం వంటి పనులు చేశారు. ఇద్దరి మధ్య అప్పటికే ఉన్న స్నేహ బంధం మరింతగా బలపడింది. తమ మధ్య ఉండే స్నేహం గురించి RRR Pre Release Eventలో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చరణ్‌తో ఉన్న బాండింగ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘మేం ఇది వరకే మంచి స్నేహితులం. ఇప్పుడు కూడా మంచి స్నేహితులం. భవిష్యత్తులోనూ మంచి స్నేహితులుగానే ఉంటాం. రామ్ చరణ్‌కు స్పెషల్ థాంక్స్. తను మంచి స్నేహితుడుకి, బాసటగా నిలిచాడు. ఇక అభిమానులే ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు నడిచాం’’ అన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదలవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yJVI5G
No comments:
Post a Comment