బాలకృష్ణతో రాఘవేంద్ర రావు ప్రయోగం.. అలాంటి పాత్రలో నటసింహం! దిగ్గజాల పక్కా ప్లాన్

ఇటీవలే 'అఖండ' విజయంలో మంచి జోష్‌లో ఉన్న నందమూరి నటసింహం .. తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. జానపద, పౌరాణిక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే ఆయన అలాంటి ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అది కూడా దర్శకేంద్రుడు దర్శకత్వంలో అనే టాక్ బయటకు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బాలకృష్ణ హీరోగా 'ఆదిశంకరాచార్య' సినిమా రాబోతోందని ఇటీవల వార్తలు షికారు చేశాయి. అయితే ఇది విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన '' జీవిత కథతో కూడిన సినిమా అని, ఈ సినిమాను రాఘవేంద్రరావు హ్యాండిల్ చేయబోతున్నారని ఇన్‌సైడ్ టాక్. గతంలో బాలకృష్ణ హీరోగా పౌరాణిక సినిమా 'పాండురంగడు' రూపొందించిన రాఘవేంద్రరావు ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. దీంతో ఆ లోటు పూడ్చేలా బాలకృష్ణ హీరోగా మరో భక్తిరస చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే 'రామానుజాచార్య' సినిమాను లైన్ లోకి తీసుకొచ్చినట్లు సమాచారం. 'రామానుజాచార్య' జీవితాన్ని సినిమాకి సరిపోయే కథగా మలిచే పనిలో ప్రముఖ రచయిత జేకే భారవి ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌పై పూర్తి కసరత్తులు చేస్తున్న రాఘవేంద్రుడు.. బాలయ్య బాబుతో సంప్రదింపులు కూడా చేసి డేట్స్ తీసుకున్నారని అంటున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రిలీజై సక్సెస్ అందుకున్న 'అఖండ' చిత్రానికి సీక్వల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అఖండ పునరాగమనం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాతో మాస్ ఆడియన్స్‌లో ఊపు తెప్పించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య తదుపరి సినిమా ఉండబోతోందనే టాక్ ఉండనే ఉంది. సో.. చూడాలి మరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో మొదలుపెడతారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FrFWza

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts