ప్రస్తుతం అటు వెండితెరపై ఇటు ఆన్ లైన్ వేదికపై బాలయ్య బాబు హవా నడుస్తోంది. ఓ వైపు థియేటర్లలో అఖండ జోష్ నడుస్తుండగా.. మరోవైపు ఆహా ఓటీటీలో ‘' () షో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. హోస్ట్‌గా కొత్త అవతారమెత్తిన తనదైన మాటలతో ఆకట్టుకుంటున్నారు. సెలబ్రిటీ గెస్టులతో బాలయ్య బాబు మాటామంతీ జనాలను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎపిసోడ్-5 కోసం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి వచ్చి సందడి చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులో బాలకృష్ణ- నడుమ జరిగిన సరదా సంభాషణ హైలైట్ అయింది. రాజమౌళితో మాట కలుపుతూనే ఇప్పటి వరకూ మన కాంబినేషన్ పడలేదని చెప్పిన బాలకృష్ణ.. నా అభిమానులు మిమ్మల్ని ‘బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు’ అని అడిగితే బాలకృష్ణను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు అన్నారట ఎందుకు? అని జక్కన్నను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రాజమౌళి.. ''అవును భయంతోనే అలా అన్నా. నేను షూట్ చేస్తుంటే మీకేమైనా కోపం వస్తుందేమోనని భయం. నా టెన్షన్ అదే'' అని చమత్కరిస్తూ నవ్వించారు. ఆ తర్వాత తన కేరీర్లో ఓ సినిమా విషయంలో జరిగిన కీలక సంఘటనను బయటపెట్టారు బాలయ్య బాబు. పూర్తి ఎపిసోడ్లో అదేంటో తెలియనుంది. ఇకపోతే భారీ సినిమాలకు చిరునామాగా మారిన రాజమౌళి.. ప్రస్తుతం RRR మూవీ ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య సమర్పణలో భారీ రేంజ్లో రూపొందిన ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీపై మెగా, నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yO1inW
No comments:
Post a Comment