ఏపీ సినిమా టికెట్స్ ఇష్యూ.. ఇండస్ట్రీకి మాటిచ్చిన బాలకృష్ణ! ఇదీ బాలయ్య బాబు రియాక్షన్

గత కొన్ని రోజులుగా ఏపీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై సినీ నిర్మాతలు, టాలీవుడ్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ రీసెంట్‌గా విడుదలైన 'అఖండ' సినిమాపై కూడా పడింది. అయితే అలాంటి అవాంతరాలన్నీ ఎదుర్కొని విజయం సాధించింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ.. ఏపీ సినిమా టికెట్స్ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. అఖండ సక్సెస్ కావడంతో ఆలయాల సందర్శన చేపట్టారు బాలకృష్ణ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య బాబు.. ఏపీ సినిమా టికెట్స్ ఇష్యూపై స్పందించారు. ''టికెట్ రేట్లపై హైకోర్టు తీర్పునిచ్చినా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్తామంటోంది. ఇవన్నీ చూసి మేం నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఇండస్ట్రీని కాపాడతాం. రాష్ట్రాన్ని ఈ సినిమా కాపాడింది. ఇక ముందు మేం ఇండస్ట్రీని కాపాడతాం'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజలంతా అఖండ సినిమాను ఆదరించడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పిన బాలకృష్ణ.. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి వచ్చి ఈ విజయంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అన్నారు. మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించడం జరిగిందని చెప్పారు. ప్రేక్షకులు సినిమాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాము ధైర్యం చేసి ముందుకు వచ్చామని, ఈ చిత్ర విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చిందని బాలయ్య బాబు అన్నారు. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ మూవీ డిసెంబర్ 2వ తేదీన విడుదలై లాభాల బాటలో పయనిస్తోంది. బాలకృష్ణ కెరీర్‌లో తొలి 100 కోట్ల క్లబ్ మూవీగా నిలవడమే గాక పలు రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33w5Y6h

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts