ఐకాన్ స్టార్ హీరోగా రూపొందించిన భారీ సినిమా 'పుష్ప' థియేటర్లలో హవా నడిపిస్తోంది. తొలుత డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా భేష్ అనిపించుకుంటోంది. వసూళ్ల వేటలో టాప్ గేరేసి దూసుకుపోతున్నారు లారీ డ్రైవర్ పుష్పరాజ్. ఈ పాత్రలో అల్లు అర్జున్ నటనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుండగా.. నిర్మాతలకు కాసుల పంట పండుతోంది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా రేర్ ఫీట్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో దేశవిదేశాల్లోని బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకొని ఆతృతగా ఎదురుచూశారు. ఆ అంచనాల నడుమ డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమాకు అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా యూఎస్ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనం పలికారు. విదేశీ తెరపై పుష్పరాజ్ సందడికి కాసుల వర్షం కురిసింది. ప్రీమియర్స్ మొదలుకొని తొలి రెండు రోజులు అదే పరిస్థితి. మొత్తంగా యూఎస్ లోని 248 లొకేషన్స్‌లో విడుదలైన 'పుష్ప ది రైజ్'.. అన్ని సెంటర్లలో కలిపి ప్రీమియర్స్ ద్వారానే 543,603 డాలర్స్ రాబట్టారు. ఆ తర్వాత తొలి రోజుకు గాను 426,944 డాలర్స్, రెండో రోజుకు గాను మరో 345,218 డాలర్స్ వసూలయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో మొత్తంగా తొలి రెండు రోజుల్లో 1,315,765 డాలర్స్‌తో దాదాపు 10 కోట్లకు పైగా వసూలు చేశాడు పుష్పరాజ్. దీంతో ఈ సంవత్సరం USAలో హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన తెలుగు చిత్రంగా 'పుష్ప' సరికొత్త రికార్డు నమోదు చేసింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్పరాజ్ ప్రభంజనం కొనసాగుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yDEqqU
No comments:
Post a Comment