సౌత్ ఇండియన్ సినిమాల్లో నయనతారకు ఉన్న క్రేజే వేరు. లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న ఈ తార ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. నయన్ సినిమా అంటే మార్కెట్ పరంగా కూడా ఎలాంటి డోకా ఉండదని భావించే దర్శకనిర్మాతలు ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంటారు. అలా ఫుల్ బిజీగా ఉన్న నయన్‌ని 'లూసిఫర్' రీమేక్ కోసం సంప్రదించగా ఆమె కొన్ని కండిషన్స్ పెట్టి అంగీకరించినట్లు తెలుస్తోంది. హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర కోసం నయనతారను తీసుకోవాలని ప్లాన్ చేసిన యూనిట్.. ఆమెతో సంప్రదింపులు చేశారట. ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటించేందుకు రెడీ అన్న .. తన పోర్షన్‌ను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని కండీషన్ పెట్టిందట. అలా అయితేనే చేస్తా అని చెప్పడంతో అందుకు మేకర్స్ అంగీకరించారనే టాక్ బయటకొచ్చింది. గతంలోనే ఈ సినిమాలో నయన్ భాగమవుతున్నట్లు వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాక తప్పుకుందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే విషయం తెరపైకి రావడం చర్చనీయాంశం అయింది. సో.. చూడాలి మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xRb7zH
No comments:
Post a Comment