గోవా అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి బీచ్ లొకేషన్, అందమైన ప్రదేశాలు. ప్రకృతి ఒడిలో సరదాగా సేద తీరడానికి గోవా వెళుతుంటారు కొందరు. ఇక గోవాను దర్శకనిర్మాతలు తమ షూటింగ్ స్పాట్‌గా వినియోగిస్తుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాల షూటింగ్స్‌కి వేదికైన గోవా లొకేషన్స్ ఇప్పుడు అల్లు అర్జున్- రష్మిక మందన రొమాంటిక్ సీన్స్‌కి వేదిక కాబోతున్నాయట. అదేనండీ.. లేటెస్ట్ మూవీ '' కోసం గోవా షెడ్యూల్ ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్స్ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ షెడ్యూల్ ఫినిష్ కాగానే.. వెంటనే గోవా పయనం కాబోతోందట పుష్ప టీమ్. అక్కడి అందమైన లొకేషన్స్‌లో అల్లు అర్జున్- రష్మిక మందనలపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారని తెలుస్తోంది. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని, దీంతో దాదాపు 'పుష్ప' షూటింగ్ కంప్లీట్ అయినట్లే అని అంటున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మూవీ రూపొందిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. రెండు భాగాలుగా ఈ సినిమా రానుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. భారీ బడ్జెట్ కేటాయించి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. యాంకర్ అనసూయ కీలకపాత్రలో కనిపించనుంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన అబ్బురపరుస్తుందని తెలుస్తుండటం సినిమాపై హైప్ పెంచేసింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన 'పుష్ప' అప్‌డేట్స్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఆతృతను పెంచేశాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ అది సాధ్యం కాకపోవచ్చని, ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gX5z0U
No comments:
Post a Comment