మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా RRR. 'బాహుబలి' తర్వాత అదే రేంజ్‌లో ఈ మూవీ రూపొందిస్తున్నారు రాజమౌళి. చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర పంచుకోనుండటం ఆసక్తికర అంశం. ఇక ఈ ఇద్దరి రోల్స్ ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా బ్యాలెన్స్ చేస్తూ కథపై కసరత్తులు చేసిన జక్కన్న.. అంతా పక్కాగా ప్లాన్ చేసి రూపొందిస్తున్నారట. మరోవైపు గురించి బయటకొచ్చిన ప్రతి అప్‌డేట్ వైరల్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. భారీ బడ్జెట్ కేటాయించి డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్‌చరణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన లుక్స్ విడుదలై సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గతంలోనే అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రోల్ ఏంటనే దానిపై ఫిలిం నగర్‌లో గుసగుసలు మొదలయ్యాయి. కొమురం భీమ్ తండ్రి పాత్రలో అంటే ఎన్టీఆర్ తండ్రి పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అజయ్ పాత్రపై కూడా సినిమాలో బాగా హైలైట్ కానుందట. అందుకే ఈ పాత్రపై జక్కన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇకపోతే ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా.. హాలీవుడ్ నుంచి రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి లాంటి స్టార్స్ కూడా భాగమవుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన రాజమౌళి.. మరికొద్ది రోజుల్లోనే ప్యాకప్ చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన RRR వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చని టాక్ నడుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jqdOV0
No comments:
Post a Comment