సినిమా రౌండప్: గోవాలో 7 రోజులు 6 రాత్రులు.. ఆ రెస్టారెంట్‌లో హీరోయిన్.. బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్!

ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 28) సినిమా రౌండప్‌లో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ సొంతింటి సంగతులతో పాటు 'ఖిలాడి' తర్వాత రవితేజ మూవీ విశేషాలు, ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న '7 రోజులు 6 రాత్రులు' షూటింగ్ అప్‌డేట్స్, ధనుష్ తెలుగు సినిమాలు అలాగే ప్రియాంక చోప్రా రెస్టారెంట్ తదితర విషయాలను చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను, సినిమా సంగతులను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం.

సినిమా రౌండప్: గోవాలో 7 రోజులు 6 రాత్రులు.. ఆ రెస్టారెంట్‌లో హీరోయిన్.. బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్!

ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 28) సినిమా రౌండప్‌లో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ సొంతింటి సంగతులతో పాటు 'ఖిలాడి' తర్వాత రవితేజ మూవీ విశేషాలు, ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న '7 రోజులు 6 రాత్రులు' షూటింగ్ అప్‌డేట్స్, ధనుష్ తెలుగు సినిమాలు అలాగే ప్రియాంక చోప్రా రెస్టారెంట్ తదితర విషయాలను చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.

బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్

మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ కొట్టేసింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. ఇటీవలే 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ చేసి హంగామా చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌, టీవీ షోలతో బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకుంది మోనాల్. షూటింగ్స్ కోసం అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ వస్తున్న ఈ భామ ఇక్కడే ఓ ఇల్లు తీసుకుంది. ఇకపై తాను పక్కా హైదరాబాదీని అయిపోయానని, ఇక్కడే ఎక్కువ కాలం ఉంటానని ఆమె పేర్కొంది.

గోవాలో 7 రోజులు 6 రాత్రులు
గోవాలో 7 రోజులు 6 రాత్రులు

ఒకానొక సమయంలో పలు సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి సూపర్ సక్సెస్ అయిన ఎంఎస్ రాజు ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టడంతో మళ్ళీ ఇప్పుడు '7 డేస్‌ 6 నైట్స్‌' అంటూ మరో ప్రయోగాత్మక సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. అయితే జులై 10 వరకు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసి ఆపై గోవా పయనమవుతోందట టీమ్. అక్కడి అందమైన ప్రదేశాల్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ షూట్ చేయనున్నారట.

ధనుష్ కమిట్!
ధనుష్ కమిట్!

తమిళంలో ఫేమస్ అయిన హీరో అయిన తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ధనుష్- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చేయగా.. తాజాగా ఆయన మరో సినిమాకు కూడా కమిటైనట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. నేటితరం ఆడియన్స్ కోరుకునేలా ఓ క్యూట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

ఖిలాడీ స్పీడ్..
ఖిలాడీ స్పీడ్..

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందుతున్న 'ఖిలాడి' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి సినిమా షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నారట రవితేజ. శరత్‌ మండవ దర్శకత్వంలో ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న రవితేజ న్యూ మూవీ జులై 1 సెట్స్ మీదకు రానుందని సమాచారం. 1990 కాలాన్ని ప్రతిబింబించేలా వాస్తవ సంఘటనల ఆధారంగా, థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్‌ ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ వేటలో ఉంది చిత్రయూనిట్.

ఆ రెస్టారెంట్‌లో ప్రియాంక చోప్రా
ఆ రెస్టారెంట్‌లో ప్రియాంక చోప్రా

న్యూయార్క్‌ సిటీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 'సోనా' పేరుతో ఓ రెస్టారెంట్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఈ రెస్టారెంట్‌ ప్రారంభించారు. అయితే మొదటిసారి తన హోటల్‌లో అడుగుపెట్టిన ప్రియాంక.. ఆయా ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. హోటల్‌ సిబ్బందితో కలిసి పానీ పూరి రుచి చూస్తూ ఎంజాయ్ చేసింది. హోటల్ ఇంటీరియర్‌, రుచికరమైన ఆహారం, డ్రింక్స్‌ అద్భుతంగా ఉన్నాయని ఆమె చెప్పింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U2nPwS

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts