గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా కాటుకు కొంతమంది సెలబ్రిటీలు బలైపోగా.. పలు అనారోగ్య కారణాలతో ఇంకొందరు సెలబ్రిటీలు ఈ లోకం విడిచి వెళ్లారు. ఓ విషాదం తాలూకు విషయాలు పూర్తిగా మరవకముందే మరో విషాద వార్త వినాల్సి వస్తుండటం సినీ వర్గాలను కలవరపెడుతోంది. తాజాగా సీనియర్ నటి భర్త, ప్రముఖ నిర్మాత మరణంతో సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఉదయం 4 గంటల 30 నిమిషాల సమయంలో గుండెపోటు రావడంతో రాజ్ కౌశల్ కన్నుమూసినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తన సొంత ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారు జామున గుండెపోటు రావడంతో వైద్యులను సంప్రదించే లోపే ఆయన తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. నిర్మాత రాజ్ కౌశల్ ఇక లేరనే వార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో రాజ్ కౌశల్ పలు సినిమాలను నిర్మిచడమే గాక.. ప్యార్ మే కబీ కబీ, షాదీ కా లడ్డు లాంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. కొన్నేళ్ల క్రితం నటి మందిరా బేడిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్క కుమారుడు. అలాగే గతేడాది ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఇక మందిరా విషయానికి వస్తే.. 90వ దశకంలో శాంతి టీవీ సీరియల్ ద్వారా హోమ్లీ క్యారెక్టర్‌తో బుల్లితెరకు పరిచయమైన ఆమె, పలు హిందీ చిత్రాలతో పాటు, సీరియల్స్, వెబ్ సీరిస్‌ల్లో నటించింది. దక్షిణాదిన శింబు మన్మథుడు, ప్రభాస్ సాహో చిత్రాల్లో నటించి మెప్పించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y7IqP7
No comments:
Post a Comment