ఎప్పటికప్పుడు ముఖ్యమైన సినిమా అప్‌డేట్స్ సంక్షిప్తంగా అందించాలని ఈ సినిమా రౌండప్ మీ ముందుకు తెస్తున్నాం. మరి ఈ రోజు (జూన్ 30) విశేషాలేంటో చూద్దామా..
ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 30) సినిమా రౌండప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' ప్రమోషన్స్, బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్, కార్తీ సినిమాలో సిమ్రాన్, మరో బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న రకుల్.. తదితర విషయాలను పొందుపరిచాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.
చిరంజీవితో నవాజుద్దీన్..
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'ఆచార్య' మూవీ చేస్తున్న ఆయన.. డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక విషయంలో బాబీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆయన కూడా చిరంజీవితో తెర పంచుకోవడానికి ఆసక్తి కనబర్చారట. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ పట్టాలెక్కనుంది.
బన్నీ ఫ్యాన్స్.. గెట్ రెడీ
అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో రాబోతున్న 'పుష్ప' నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నారట మేకర్స్. బన్నీ డాన్స్ అంటే ఫ్లోర్స్ దద్దరిల్లాల్సిందే. ఆయన తాజా సినిమా 'పుష్ప'లో కూడా అదే రేంజ్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూడబోతున్నామని తెలుస్తోంది. మాస్ క్యారెక్టర్ అయినా బన్నీతో స్టెప్పుల విషయంలో సుకుమార్ వెనక్కి తగ్గలేదట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన సుక్కు.. ఇక ప్రమోషన్స్‌పై స్పెషల్ కేర్ తీసుకోబోతున్నారట. ఇందులో భాగంగా 'పుష్ప' నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అర్జున్ ఆంజనేయ స్వామి ఆలయం
ఆంజనేయ స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంటూ సీనియర్ హీరో అర్జున్ ఓ ఆలయం నిర్మించారు. చెన్నైలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో ఆంజనేయుడికి గుడి కట్టించారాయన. ఆలయ నిర్మాణ పనులు దాదాపు ఫినిష్ కావడంతో జులై 1న కుంభాభిషేకం చేయబోతున్నారు. అభిమానులతో పాటు తనకు తెలిసిన వాళ్లందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని అనుకున్నాను కానీ కరోనా పరిస్థితుల కారణంగా అది కుదరలేదని అర్జున్ పేర్కొన్నారు.
అక్షయ్ సరసన రకుల్
తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా తన అందచందాలతో ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ తెరపై కూడా హవా నడిపిస్తోంది. తాజాగా ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కిందని సమాచారం. ‘బెల్‌బాటమ్’ నిర్మాత జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ''మేడే, థాంక్ గాడ్, ఇండియన్ 2'' సినిమాలు చేస్తోంది రకుల్.
ఆ హీరో కోసం రంగంలోకి సిమ్రాన్
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి అడుగులేస్తోంది. సెలక్టెడ్‌గా సినిమాలు ఎంచుకుంటున్న ఆమె.. హీరో కార్తి కోసం రంగంలోకి దిగుతోందని సమాచారం. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్దార్’. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుంది. ఈ సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో సిమ్రాన్ నటించనుందట. ఈ చిత్రంలో కార్తీ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y7NJhr
No comments:
Post a Comment