ఎప్పుడైతే రెండో పెళ్లి వార్త బయటకొచ్చిందో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన న్యూస్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. స్టార్ సింగర్‌గా కొన్ని వందల సినిమాల్లో తన గాత్ర మాధుర్యంతో అలరించిన సునీత.. ఈ ఏడాది ఆరంభంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. బిజినెస్‌మెన్ రామ్ వీరపనేనిని ఆమె పెళ్లాడింది. ఈ పెళ్లి తాలూకు సంగతులు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కొందరు నెగెటివ్ కామెంట్స్ చేసినా కాంట్రవర్సీల జోలికి పోలేదు సునీత. మరోవైపు తన రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్ పెంచేసి.. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది సునీత. కుటుంబ విషయాలతో పాటు కెరీర్ సంగతులను పంచుకుంటోంది. అలా అప్పటి నుంచి ఆమెకు సంబంధించి ఏదో ఒక వార్త హైలైట్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సునీత కూడా భర్తతో పాటు వ్యాపార వ్యవహారాలు చూసుకునేందుకు రెడీ అవుతుందనే సమాచారాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సునీత భర్త మ్యాంగ్ వీడియోస్‌తో పాటు మరికొన్ని డిజిటల్ చానల్స్‌కు హెడ్‌గా ఉన్నారు. అయితే ఇప్పుడు తన బిజినెస్ మరింత విస్తరించాలని భావించిన ఆయన సునీత సాయం కోరడంతో ఆమె కూడా ఓకే చెప్పిందట. అలా ఇద్దరూ కలిసి మ్యాంగో బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్‌ల నిర్మాణ బాధ్యతలు సునీతనే పూర్తిగా మోయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు కొత్త దర్శకులు, నటీనటులను ఎంకరేజ్ చేసేలా సునీత దంపతులు ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. రోజురోజుకూ ఓటీటీ కంటెంట్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సింగర్ సునీత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైందని అంటున్నారు ఈ విషయం తెలిసిన జనం. ఆమెకు బిజినెస్ కావడమే గాక కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు ఇదో వేదిక కానుండటం శుభపరిణామం అంటున్నారు. సో.. చూడాలి మరి సునీత వ్యాపార ప్రకటన ఎప్పుడొస్తుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AfyYLc
No comments:
Post a Comment