ఫేమస్ డైరెక్టర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. తన పెద్ద కూతురు ఐశ్వర్యకు పెళ్లి చేసే పనిలో పడ్డారు శంకర్. ఓ క్రికెటర్‌తో ఫిక్సయిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ ఇష్యూ అయింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో స్టార్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోదరన్‌తో ఐశ్వర్య పెళ్లి నిశ్చయించారట డైరెక్టర్ శంకర్. దీంతో బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయమై ఆరా దీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. రోహిత్ తండ్రి దామోదరన్ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అని, మధురై పాంథర్స్ టీమ్‌కి స్పాన్సర్‌గా కూడా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లికి సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు ఫినిష్ చేశారని, త్వరలో పెళ్లి జరగబోతోందని సమాచారం. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా మహాబలిపురంలో వీరి వివాహాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ పెద్ద పార్టీ అరేంజ్ చేయాలని శంకర్ భావిస్తున్నారట. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ వస్తున్న శంకర్.. ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. దీంతో పాటు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో అపరిచితుడు రీమేక్ మూవీ కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x20v0G
No comments:
Post a Comment