నాచురల్ స్టార్ నానితో సమరానికి సై అందట ఫిదా బ్యూటీ సాయి పల్లవి. ఇప్పటిదాకా వెండితెరపై చాలా సున్నితమైన క్యారెక్టర్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం తన పవర్ ఏంటనేది బయటపెట్టబోతోందట. ఏకంగా హీరో నానిని బలంగా ఢీ కొట్టబోతోందట. అదేనండీ.. హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ''లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవి నెగెటివ్ రోల్ పోషిస్తోందని తెలుస్తోంది. విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో సత్తా చాటుతున్న నాని.. 'శ్యామ్ సింగరాయ్' రూపంలో మరో ప్రయోగాత్మక సినిమాను లైన్‌లో పెట్టారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీలో విలన్ ఎవరనే దానిపై సందేహాలు నెలకొనగా తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 'శ్యామ్ సింగరాయ్'లో ప్రత్యేకంగా విలన్ ఎవరూ లేరు. సాయి పల్లవినే విలన్ అని, ఆమె క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడుకొని ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వెండితెరపై ఇప్పటి వరకు చూసిన సాయి పల్లవి వేరు.. 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో చూసే సాయి పల్లవి వేరు అని చెప్పుకుంటున్నారు. నాని కోసం ఈ డేరింగ్ స్టెప్ తీసుకొని విలన్ రోల్ పోషిస్తోందట సాయి పల్లవి. ఇకపోతే ఈ సినిమాకు చిత్రానికి మెలోడీ సాంగ్ స్పెషలిస్ట్ మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమాటం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సో.. చూడాలి మరి వెరీ పవర్‌ఫుల్ లేడీగా సాయి పల్లవి ఏ రేంజ్ పర్‌ఫార్‌మెన్స్ ఇస్తుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x0DGuv
No comments:
Post a Comment