సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎంతో కొంత స్పేస్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో నయన్ పెళ్లి మ్యాటర్ అనేది ఓ హాట్ టాపిక్. గతంలో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లి పీటల దాకా వెళ్లిన లవ్ స్టోరీకి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది నయనతార. ఈ ఇద్దరిది కూడా చాలాకాలంగా కొనసాగుతున్న లవ్ ఎఫైర్. మొదటి సీక్రెట్‌గా నడిపించినా ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. దీంతో మ్యాటర్ మరోసారి చర్చల్లో నిలిచింది. నయనతార- విగ్నేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్నినెలలుగా వార్తల ప్రవాహం కొనసాగుతోంది. కానీ ఆ మూడు ముళ్ళ బంధానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. దీంతో వాళ్లిద్దరు ఎక్కడ కనిపించినా ప్రేక్షకుల నుంచి ముందుగా వచ్చే ప్రశ్న 'మీ పెళ్లి ఎప్పుడు?'. ఈ నేపథ్యంలో తాజాగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించగా మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే దీనిపై ఆయన చెప్పిన సమాధానం విని షాకయ్యారు నెటిజన్లు. ముందు డబ్బు సంపాదించాలి.. ఆ తర్వాతే పెళ్లి అని విగ్నేష్ పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. నయనతారతో మీ సీక్రెట్ పిక్ అని అడిగితే.. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఓ పిక్ షేర్ చేశారు విగ్నేష్ శివన్. అంతేకాదు చీరలో నయన్ చాలా అందంగా ఉంటుందని, చీరకట్టు ఆమెకు బాగా సూట్ అవుతుందని అన్నారు. ఇక 'మీరు ఎందుకని నయన మేడమ్‌ను ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు? దాని కోసం మేమంతా వేచి చూస్తున్నాం' అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో.. 'పెళ్లి దాని తర్వాత జరిగేవన్నీ చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి బ్రదర్. అందుకే చాలా రోజులుగా డబ్బు పోగు చేస్తున్నాం' అంటూ షాకింగ్ ఆన్సర్ చేశారు విగ్నేష్. దీంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకపోతే ఇదే సెషన్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలపై రియాక్ట్ అయిన విగ్నేష్.. సినీ ఇండస్ట్రీలో తనకు రజినీకాంత్ ప్రేరణ అని చెప్పారు. ఆయనతో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టారు. అదే విధంగా ఒకవేళ బాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేయాల్సివస్తే రణ్‌బీర్ కపూర్‌తో చేయాలనుందని అన్నారు. అలాగే తన ఫేవరెట్ క్రికెటర్ ధోనీ అని విగ్నేష్ చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hjtFSm
No comments:
Post a Comment