టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఇప్పుడు మంచి గుర్తింపు ఉంది. మాస్ కా దాస్ అంటూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఫలక్ నుమా దాస్ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా నిరూపించుకున్నారు. అలా తనకంటూ ఓ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నారు. అయితే విశ్వక్ సేన్ ఎంచుకునే కథలు మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. సినిమాతో విశ్వక్ సేన్‌లోని నటుడు బయటకు వచ్చారు. అప్పటి వరకు విశ్వక్ సేన్‌ను విమర్శించిన వారంతా కూడా షాక్ అయ్యారు. అలా విశ్వక్ సేన్ నటుడిగా మరో మెట్టు ఎక్కినట్టు అయింది. అలా HIT సినిమాతో విశ్వక్ తన ఖాతాలో సూపర్ హట్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో అన్నింటి కంటే ముందుగా సినిమా రాబోతోంది. మామూలుగా అయితే ఈపాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు వాయిదా పడింది. అలా తన ప్లాన్స్ అన్నీ కూడా తారుమారు అయ్యాయి.అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడుతుండటంతో మళ్లీ షూటింగ్‌లో జోరు మొదలైంది. ఈక్రమంలో విశ్వక్ సేన్ కూడా రంగంలోకి దిగారు. తన పాగల్ సినిమా షూటింగ్‌ను చకచకా కానిచ్చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సెట్స్ మీద షూటింగ్ జరుగుతున్న వీడియోను షేర్ చేస్తూ దర్శకుడిని అప్డేట్ గురించి అడిగారు. ఇక పాగల్ షూటింగ్ నేటితో పూర్తి కానుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి పాగల్ థియేటర్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xZZs1D
No comments:
Post a Comment