గతేడాది కరోనా కారణంగా ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది సినీ పరిశ్రమ. కోవిడ్ సోకి పలువురు సినీ నటులు తిరిగిరాని లోకాలకు వెళ్లి విషాదం మిగిల్చారు. ఆ తర్వాత సెకండ్ వేవ్ లోనూ పలువురి మరణాలతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఆనారోగ్య కారణాలతో ఇంకొందరు సినీ ప్రముఖులు మరణిస్తుండటం ఇండస్ట్రీలో మరింత విషాదం నింపుతోంది. ఆదివారం రాత్రి చెన్నైలో ప్రముఖ సినీ కళా దర్శకుడు (60) క్యాన్సర్‌తో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న షణ్ముఖం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటునప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుది శ్వాస విడిచారు. తమిళంతో పాటు తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా ప్రముఖ హీరోల చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు మూడుసార్లు కార్యదర్శిగా పనిచేశారు అంగముత్తు షణ్ముఖం. ఆయన మరణ వార్త తెలిసి తమిళ సినీ ప్రముఖులు, దక్షిణ భారత సినీ ప్రముఖులతో పాటు దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి తదితరులు సంతాపం తెలియజేశారు. నేడు (సోమవారం) నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jmgT8q
No comments:
Post a Comment