తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న చర్చ జరుగుతోన్న వేళ తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు.
వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తనదైన పంథాలో వెళుతున్నారు. ఎలాంటి విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే ఆయన, ఇటీవలి కాలంలో బోల్డ్ మాటలతో పిచ్చెక్కిస్తుండటం చూస్తున్నాం. అందుకే సోషల్ మీడియాలో వర్మ కామెంట్స్ అయినా, ఆయన ఇంటర్వ్యూ అయినా యమ డిమాండ్ సంతరించుకున్నాయి. కేవలం సినిమాలే గాక సమాజ పరిస్థితులు, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై కూడా వర్మ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా TPCC చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక చేయడంపై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
TPCC చీఫ్‌గా రేవంత్ రెడ్డి
గత కొన్ని రోజులుగా తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న చర్చ జరుగుతోన్న వేళ తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. గత డిసెంబరులో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత TPCC చీఫ్ బాధ్యతల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాక కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమకంటే తమకే TPCC చీఫ్ పదవి కావాలని ఆరాటపడ్డారు. ఈ పరిస్థితుల నడుమ రేవంత్ రెడ్డి ఎంపికను కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం.
రంగంలోకి దిగిన రామ్ గోపాల్ వర్మ
TPCC చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక చేస్తున్నట్లు శనివారం సాయంత్రం ప్రకటన వెలువడింది. అయితే ఆయనను చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనపై కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తుంటే.. కొందరు సీనియర్ నాయకులు మాత్రం తీవ్ర అసంతృత్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగిన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం వెల్లడిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానంపై కామెంట్స్ చేశారు. తనదైన స్టైల్‌లో పులి, సింహం అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఇక పులులన్నీ బెదిరిపోవాల్సిందే..
''లయన్.. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఒక సూపర్, ఫెంటాస్టిక్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు పులులన్నీ రేవంత్ రెడ్డి అనే సింహానికి భయపడిపోవాల్సిందే'' అని ట్వీట్ పెట్టిన వర్మ.. ఆ వెంటనే మరో ట్వీట్ చేస్తూ ''రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఆసక్తి కలిగింది. రాహుల్ గాంధీ నువ్వు, మీ అమ్మ ఒక గొప్ప పని చేశారు'' అని పేర్కొనడంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గతంలో టీడీపీ వీడిన సమయంలో..
రేవంత్ రెడ్డి విషయమై గతంలో కూడా చాలా సందర్భాల్లో రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. అప్పట్లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో కూడా పాజిటివ్ రియాక్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి అని, బాహుబలి బాక్సాఫీస్‌కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తాడని వర్మ స్పందించిన తీరు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w0OrM7
No comments:
Post a Comment