హీరోగా, నిర్మాతగా తనదైన దారిలో వెళుతున్న '' రూపంలో మరో ప్రయోగాత్మక సినిమాను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. కళ్యాణ్ రామ్ 18వ సినిమా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అయితే గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిందట. మరి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తే ప్యాకప్ చెప్పేయడమే అని తెలుస్తోంది. స్వయంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకొని ఇందులో హీరోగా నటిస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పటిదాకా వచ్చిన అవుట్‌పుట్ చూసి పూర్తి సంతృత్తి వ్యక్తం చేశారట. అతి త్వరలో మిగిలిన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇటీవల విడుదల చేసిన 'బింబిసార' ఫస్ట్ లుక్ పోస్టర్ 'బాహుబలి' రేంజ్‌లో కనిపించడంతో ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందనే టాక్ నడుస్తోంది. ఇకపోతే కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన సరసన కేథరిన్, సమ్యుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వశిష్ట్ దర్శకత్వం వహిస్తుండగా.. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తనపై దండెత్తడానికి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w3acL7
No comments:
Post a Comment