చిన్నారి పెళ్లికూతురు ఫేమ్, సినీ నటి అవికా గోర్ తన సహ నటుడు రైసింఘన్‌తో డేటింగ్ చేసిందని, రహస్యంగా ఓ శిశువుకు జన్మనిచ్చిందనే వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుండటంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. దీంతో వీటిపై రియాక్ట్ అయిన అవికా గోర్ మనీష్ తనకు స్నేహితుడు అని, తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇదే అంశంపై మనీష్ కూడా స్పందిస్తూ అసలు విషయం చెప్పాడు. ‘సస్రూల్ సిమర్ కా’ అనే సీరియల్‌లో మనీష్- అవికా కలిసి పనిచేశారు. వాళ్ళ కెమిస్ట్రీ చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, రహస్యంగా బిడ్డకు కూడా జన్మనిచ్చారనే పుకార్లు పుట్టించారు. దీనిపై రియాక్ట్ అయిన మనీష్.. అలా వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పాడు. అవికా తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అన్నాడు. తమ మధ్య వయసులో 18 సంవత్సరాల తేడా ఉందని, ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య స్నేహబంధం కొనసాగుతోందని చెప్పాడు. కాగా అవికాతో తనకు రిలేషన్ ఉందని వచ్చిన వార్తలు చూసి తన భార్య సంగీత నవ్వుకుందని ఆయన అన్నాడు. మరోవైపు ఇటీవలే అవికా కూడా ఇదే విషయం చెప్పింది. మనీష్ తనకు మంచి మిత్రుడు మాత్రమే అని చెప్పిన ఆమె.. మిలింద్ చంద్వాణీ అనే యువకుడితో రిలేషన్‌లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న .. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఫేమ్ కొట్టేసింది. ప్రస్తుతం నాగ చైతన్య 'థాంక్యూ' సినిమాలో అవికా నటిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wUqXcP
No comments:
Post a Comment