నాని ఏడిపించాడు నాని నటించిన 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ చూసి తనకు ఏడుపొచ్చిందని అంటున్నారు షాహిద్. నాని ఆ పాత్రలో చాలా బాగా నటించాడని ఆయన తెలిపారు. 'జెర్సీ' హిందీ రీమేక్‌కి కూడా తెలుగు వర్షన్ రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహిస్తున్నారు. ఫిక్స్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించనున్న ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్‌గా ఫైనల్ చేశారని టాక్. ఈ న్యూస్ ఎప్పటినుంచో వస్తున్నా తాజాగా కియారాతో డీల్ సెట్ చేసుకున్నారని సమాచారం. అది చూడగానే వణికిపోయిన హాట్ బ్యూటీ ఇంజెక్షన్ తీసుకోడం నాకు పెద్ద విషయం. ఇంజెక్షన్ వేయించుకోవడమంటే చాలా భయం. కానీ ఎట్టకేలకు ఆ పని పూర్తి చేశాను.. దయచేసి నవ్వకండి అంటూ తాను వ్యాక్సిన్ తీసుకున్న వీడియో షేర్ చేసింది హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి. రష్మిక కోసం అన్ని కష్టాలు చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెంచుకుంది రష్మిక మందన. ఆమెను డైరెక్టుగా చూడటం కోసం ఓ అభిమాని ఏకంగా 900 కిమీ ప్రయాణించి ఆమె స్వగ్రామానికి చేరుకున్నాడు. కానీ అక్కడ ఆమె లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. పవన్, రానా రెడీ పవన్ కళ్యాణ్, రానా కాంబోలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడ్డ ఈ షూటింగ్‌ని తిరిగి జులై రెండో వారంలో ప్రారంభించాలని చూస్తున్నారట. ఇందులో పవన్, రానాలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టనున్నారట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vUN2qi
No comments:
Post a Comment