గతేడాది బాలీవుడ్ యంగ్ యాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. మంచి భవిష్యత్ ఉన్న ఈ టాలెంటెడ్ నటుడి సూసైడ్ కేసు నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ హిందీ సినిమాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన 'చిచోరే' మూవీ సెలక్ట్ అయింది. దీంతో అంతా మరోసారి సుశాంత్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. తాజాగా 'జాతిరత్నాలు' ఫేమ్ ట్విటర్ వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో 200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి 'చిచోరే' మూవీ రూపొందించారు. 2019 సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పాటు నవీన్ పోలిశెట్టి కూడా నటించారు. యాసిడ్ రోల్ పోషించిన నవీన్ బీటౌన్ ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే ఆ సినిమా సమయంలో సుశాంత్‌తో మంచి స్నేహం ఏర్పర్చుకున్న నవీన్ పోలిశెట్టి.. తాజాగా 'చిచోరే' మూవీకి జాతీయ అవార్డు వరించిన సందర్భంగా తన స్నేహితుడిని గుర్తు చేసుకున్నారు. ''బెస్ట్ హిందీ సినిమాగా 'చిచోరే' నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. మరోవైపు జాతిరత్నాలు మూవీ బ్లాక్ బస్టర్ సాధించింది. నాకు తెలుసు సుశాంత్.. ఇవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు. ఇది నీ కోసమే. మిస్ యూ భాయ్'' అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. ఆ చిత్ర దర్శకుడు నితేశ్ సహా చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఓ వైపు టాలీవుడ్‌లో 'జాతిరత్నాలు' హవా కొనసాగుతుండటం, మరోవైపు నవీన్ హిందీ మూవీ 'చిచోరే'కు జాతీయ అవార్డు రావడంతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ అందలమెక్కిందనే చెప్పుకోవాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/398rqhv
No comments:
Post a Comment