మెగా వారసుడు, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రోజు (మర్చి 27) చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తూ పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వైపు సెలబ్రిటీలు, మరోవైపు మెగా అభిమాన లోకం చెర్రీకి శుభాకాంక్షలు వెల్లువలా చెబుతుండగా.. అందరిలో ప్రత్యేకం అన్నట్లుగా తన సందేశం పోస్ట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. రామ్ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చారు. దీంతో పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''రాముడు దేవుడు మాత్రమే కాదు.. అన్నదమ్ముల ప్రేమకు ప్రతిరూపం. తోబుట్టువుల స్నేహానికి నిదర్శనం. మా జెనరేషన్‌లో అన్నయ్య చిరంజీవి రాముడిలా ఉండేవారు. ఈ జెనరేషన్‌లో అన్నదమ్ములకు అండగా ఉంటూ రాముడివయ్యావు రామ్ చరణ్. అన్నయ్య చిరంజీవి పెట్టిన నీ పేరులోని అర్థాన్ని నిలబెట్టావు. హ్యాపీ బర్త్ డే'' అని పేర్కొంటూ నాగబాబు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ గొప్పతనాన్ని తెలుపుతూ మెగాబ్రదర్ పెట్టిన ఈ ట్వీట్ మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తోంది. నటుడిగానే కాక నిర్మాతగా కూడా రాణిస్తూ నేటితరం హీరోల్లో టాప్ ప్లేస్ తనదే అనిపించుకుంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమాలో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా నందమూరి హీరో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదల కోసం మెగా లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sF9cw5
No comments:
Post a Comment