పవర్ స్టార్ రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సమయం దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానుల హంగామా మామూలుగా లేదు. రెండేళ్ల టైమ్ గ్యాప్ తీసుకొని వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో ఆ క్షణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (సోమవారం) సాయంత్రం రిలీజ్ చేయడంతో దీనికి ఓ రేంజ్ స్పందన వస్తోంది. లాయర్ అవతారంతో పవన్‌ని చూసి ఊగిపోతోంది మెగా లోకం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ రచ్చే కనిపిస్తోంది. ‘మీరు వర్జినా అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా? ఏం న్యాయం నందాజీ’ అంటూ కోర్టులో పవన్ వేసిన కౌంటర్స్ చిత్ర విడుదలకు ముందే గోల పెట్టిస్తున్నాయి. ఇక రికార్డులకు పెట్టింది పేరు అని ఇది వరకే నిరూపించుకున్న పవన్.. అదే జోష్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'వకీల్ సాబ్' ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ పలు రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన క్షణం నుంచే స్పీడ్ పెంచేసిన వకీల్ సాబ్ ట్రైలర్ మొదటి 115 నిమిషాల్లో 500K లైక్స్ సంపాదించింది. ఇక వ్యూస్ అయితే చెప్పాల్సిన పనే లేదు.. జెట్ స్పీడులో వస్తున్నాయి. ఇక మొదటి 236 నిమిషాల్లో 658K లైక్స్ సంపాదించి టాలీవుడ్‌లో ఇంత త్వరగా ఇన్ని లైక్స్ పొందిన ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇన్నాళ్లు బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ సైతం తుడిచిపెట్టుకుపోయింది. ప్రెజెంట్ ఈ ట్రైలర్ జోష్ చూస్తుంటే మొదటి 24 గంటల్లో ఎవ్వరికీ అందనంత దూరంలో అరుదైన రికార్డ్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఏప్రిల్ 9న ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u0gr1y
No comments:
Post a Comment