బుల్లితెర ఫైర్ బ్రాండ్, సౌండ్ సిస్టమ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందు బుల్లితెర మీద రాములమ్మగా బాగానే ఫేమస్ అయ్యారు. రాములమ్మగా ఐకానిక్ స్టెప్పులతో శ్రీముఖి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. స్టార్ యాంకర్‌గా ఉన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి వెళ్లారు. మూడో సీజన్‌లో హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్‌గా శ్రీముఖి నిలిచారు. అలా ఆమె క్రేజ్ బిగ్ బాస్‌కు ముందు బిగ్ బాస్‌కు తరువాత అన్నట్టు మారిపోయింది. బిగ్ బాస్ షోకి రాకముందు శ్రీముఖిపై నెగెటివిటీ అనేది లేదు. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఆమె చేష్టలు, మాటలు, ద్వేషం ఇవన్నీ చూశాక విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె చేసిన కోల్డ్ వార్ ఆమెను దారుణంగా దెబ్బ కొట్టేసింది. బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచే అన్ని అర్హతలున్నా కంటెస్టెంట్‌గా శ్రీముఖికి భారీ మద్దతు లభించింది. కానీ ప్రతీసారి రాహుల్ సిప్లిగంజ్‌ను టార్గెట్ చేయడంతో అతనే టైటిల్ విన్నర్‌గా గెలిచాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి దూకుడు తగ్గింది. మునుపటిలా యాంకరింగ్ చేయడం లేదు. ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు శ్రీముఖి చేతిలో ఒక్కటంటే ఒక్క షో కూడా లేదు. పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు మాత్రమే శ్రీముఖి చేస్తున్నారు. అలా తాజాగా ఓ ఈవెంట్‌లో శ్రీముఖి సందడి చేస్తున్నారు. ఇందులో శ్రీముఖి తన గ్యాంగ్‌తో కలిసి దుమ్ములేపుతోన్నట్టు కనిపిస్తున్నారు. మామూలుగా శ్రీముఖి గ్యాంగ్‌లో ఆర్జే చైతు, , సాకేత్ సోదరి, అవినాష్, అరియానా, విష్ణుప్రియ ఉంటారు. శ్రీముఖి తన గ్యాంగ్‌తో కలిసి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ అందరూ ఒకే చోట కలిశారంటే అక్కడంతా సందడి వాతావరణం నెలకొంటుంది. మొన్నామధ్య శ్రీముఖి తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక సింగర్ సాకేత్‌తో శ్రీముఖి ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంటుంది. తాజాగా శ్రీముఖి ఓ ఈవెంట్ ఫోలో పాల్గొన్నారు. అందులో సాకేత్ కూడా పర్ఫామెన్స్ ఇచ్చినట్టున్నారు. ఈ ఈవెంట్ షూటింగ్ రాత్రంతా జరిగింది. ఉదయం ఆరు గంటల వరకు షూటింగ్ జరిగింది. తెల్లవారు ఝామున షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి శ్రీముఖి వెళ్లారు. కానీ ఇంత లోపు సాకేత్ మాత్రం ఎంత అల్లరి చేయాలో అంత చేసేశారు. శ్రీముఖి ఫోన్‌ను దొంగతనం చేసి మరీ ఏడిపించాడు. ఆమె ఫోన్‌ను తీసుకుని అందులో ఫోటోలు దిగడం, దొంగచాటుగా శ్రీముఖి వీడియోలు తీసి ఇన్ స్టాలో పెట్టేయడం చేశారు. ఇక దీనిపై శ్రీముఖి సీరియస్ అయ్యారు. ఓరేయ్ సాకేత్ మారవా? నువ్ మారవా? నా ఫోన్ దొరికిన ప్రతీసారి ఈ ఫోటోలు దిగుడు ఏందిరా?‘ అని కౌంటర్ వేశారు. ఇక అంతేకాకుండా శ్రీముఖి వాల్ పేపర్‌ను మార్చేశారు. ఒరేయ్ సాకేత్.. ఫోన్‌లు దొంగతనం చేయడం ఆపు అని శ్రీముఖి వార్నింగ్ ఇచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39uX3C3
No comments:
Post a Comment