పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మరోసారి వెండితెరపై చూసే ఆ సమయం ఆసన్నమవుతోంది. ఆయన రీ- ఎంట్రీ మూవీ '' ఏప్రిల్ 9వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవలే తన పాత్ర కోసం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. శనివారంతో ఆ పని పూర్తి చేసేశారు. ఇదిలాఉంటే ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు నిర్మాత బోనీ కపూర్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ 'వకీల్ సాబ్' సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. పవన్ రీ- ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న దర్శకనిర్మాతలు పవన్ ఫ్యాన్స్ ఊగిపోయేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకులు బోనీ కపూర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 'పింక్' సినిమాను తమిళంలో అజిత్‌తో 'నేర్కొండ పర్వాయ్' తీశాం. అందులో ఓ యాక్షన్ సీన్‌ను చేర్చాం అని చెప్పిన ఆయన.. ఇప్పుడు తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్'లో పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు పెట్టామని అన్నారు. చిత్రంలో ఈ రెండు సీన్స్ క్రేజ్‌ని రెట్టింపు చేసేలా ఉంటాయని తెలిపారు. ఇది వినగానే పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ అమాంతం పెరిగింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో సరసన ముగ్గురు హీరోయిన్లు నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నటిస్తున్నారు. శృతి హాసన్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్‌ని తిరిగి వెండితెరపై చూడబోతున్నామనే శుభవార్త మెగా అభిమానుల్లో జోష్ నింపింది. ఈనెల 29న 'వకీల్ సాబ్' ట్రైలర్ విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PDzArb
No comments:
Post a Comment